ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో హెడ్ కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని సుమారు 700 పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ఓ రాజకీయ పార్టీకి అందించామని స్పెషల్ బ్రాంచ్‌ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి మాట్లాడిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ కోరిన వీడియో హాల్‌చల్‌ చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో జులై 30న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. 


ఈ సమావేశంలోనే  హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనతోపాటు మరో ఆరుగురు పోస్టల్ బ్యాలెట్లను సేకరించామని, తమ కృషికి తగిన రీతిలో ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లే ఇప్పటికీ ముఖ్యమైన పదవుల్లో ఉన్నారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆ వీడియో అన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రణీత్ రెడ్డిని హెడ్ కానిస్టేబుల్ కోరారు. ఆ వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెడ్ కానిస్టేబుల్‌ నర్రా వెంకటరెడ్డిని వేకెన్సీ రిజర్వు (వీఆర్)కు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎవరెవరు హాజరయ్యారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


పోలీసు శాఖలోని కొందరి సహకారంతో పోస్టల్ ఓట్ల వివరాలు ఓ పార్టీ వారికి అందించామంటూ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి ఆ వీడియో వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో తనతోపాటు కోటిరెడ్డి, మల్లారెడ్డి, సుబ్బారావు, వేణు, కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ అందరూ కలిసి 700కు పైగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వివరాలు సేకరించామన్నారు. ఈ  వివరాలు ఓ పార్టీకి ఇచ్చామన్నారు. తమ కృషిని గుర్తించి న్యాయం చేయాలని మంత్రి తనయుడు ప్రణీత్ రెడ్డిని సమావేశంలో కోరారు.  గత ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన వీడియోలో అన్నారు. తమకు న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తీవ్రంగా పరిగణించారు. 


Also Read: NGT Fire on AP Govt : పర్యావరణ అనుమతుల్లేకుండా ప్రాజెక్టులా..? మరోసారి ఎన్జీటీ ఆగ్రహం..!