అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే- ఒంగోలులో ఫ్లెక్సీ కాక

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు వ్యతిరేకంగా ఒంగోలులో NTRఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Continues below advertisement

గత కొన్ని రోజులుగా నెల్లూరులో రాజకీయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. నెల్లూరు జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర ఎంటర్ అయ్యాక మరింత హాట్‌గా మారింది. ఈ టైంలోనే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్‌కు మద్దతు తెలపడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అదే స్థాయిలో వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది. ఇలా ఇరు పార్టీల నేతల మధ్య విమర్శలతోపాటు సవాళ్ల పర్వం కొనసాగింది. 

Continues below advertisement

ఇప్పుడు నెల్లూరు రాజకీయం ఒంగోలుకు షిప్టు అయినట్టు కనిపిస్తోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ మరికొన్ని రోజుల్లో ఒంగోలులో అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా వార్‌ ఇప్పుడు మరో ఒంగోలుకు షిప్టు అయినట్టు కనిపిస్తోంది. పాదయాత్ర చేస్తూ జోష్ మీద ఉన్న లోకేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. ఆయన పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ఒక్క డైలాగ్‌తో మొత్తం స్టేట్‌ అటెన్షన్‌ను గెయిన్ చేసిందా ఫ్లెక్సీ.  

ఎన్టీఆర్‌ను ప్రస్తావిస్తూ అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ కామెంట్‌ చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

Continues below advertisement