TDP Activists dies at Chandrababu Meeting: నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోగా, మృతుల సంఖ్య 8కు చేరింది. వారిని కాల్వ నుంచి బటయకు తీసి, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు, వారి ఫ్యామిలీస్‌కి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమకు చెందిన ట్రస్టుల నుంచి వారి పిల్లల చదువులు లాంటి అవసరమైనన అన్ని సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు చంద్రబాబు. సభకు హాజరైన వారు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. చనిపోయిన వారి కోసం సభ వద్ద మౌనం పాటించారు. చంద్రబాబు కొన్ని నిమిషాల ముందు నుంచే హెచ్చరిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుసుకుంది.


బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట, 8 మంది మృతి – మృతుల వివరాలు : దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), కలవకూరి యానాది (కొండమూడుసుపాలెం), యాటగిరి విజయ (ఉలవపాడు), కాకుమాని రాజా (కందుకూరు), మరలపాటి చినకొండయ్య (గుళ్లపాలెం), పురుషోత్తం (కందుకూరు)


అసలేం జరిగిందంటే..
ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటించారు. ఇటీవల చంద్రబాబు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు కందుకూరులో నిర్వహించిన సభ (Chandrababu Kandukur Meeting)కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. గుండంకట్ట ఔట్‌లెట్‌లో కొందరు టీడీపీ కార్యకర్తలు జారిపడిపోయారు. మురుగునీటి కాల్వలో పడిపోయిన వారిలో ఐదుగురు చనిపోయారని చంద్రబాబు ప్రకటించారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇలా జరగడంతో సభ మధ్యలోనే ఆపేసి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నానని చెప్పారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ కార్యకర్తలతో పాటు చనిపోయిన కార్యకర్తల కుటుంబ సభ్యలను పరామర్శించారు.


చంద్రబాబు కందుకూరు సభలో విషాదం, కార్యకర్తల మృతి వీడియో..



మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం –చంద్రబాబు
కందుకూరు మీటింగ్ లో ప్రమాదవశాత్తు చనిపోయిన మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరపున చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మొదట అధికారికంగా ఇద్దరు చనిపోయినట్టు ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య 7 కి పెరిగింది. ఈ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఏడుగురు చనిపోయారని సమాచారం అందింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.