Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మర్రిపాడు (Marripadu) మండలం కండ్రిక వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ (Private Travels Bus Accident) బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 10 మంది వరకూ గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా అధికారులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ట్రావెల్స్‌ బస్సు బళ్లారి (Ballari) నుంచి నెల్లూరుకు (Nellore) వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసి కాపాడారు.


కానీ, బస్సు ప్రమాదం జరిగిన తీరు మాత్రం తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ప్రమాదం చూసి ఎంతమంది చనిపోయారో అనుకున్నారు స్థానికులు. కానీ అదృష్టవశాత్తు ఒక్కరికి కూడా ప్రాణాపాయం జరగలేదు. ట్రావెల్స్ బస్సులో గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని ఇంకో బస్సు ఏర్పాటు చేసి నెల్లూరుకి తరలించారు. ఈ ప్రమాదం నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు మండలం (Marripadu Mandal) పొంగూరు కండ్రిగ (Ponguru Kandriga) వద్ద జరిగింది. బళ్లారి నుంచి నెల్లూరు (Ballari to Nellore Bus Accident) వైపు వెళ్తున్న PSR ప్రైవేట్ ట్రావెల్ బస్సు (PSR Travels Bus) కండ్రీగ వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పెట్రోల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న వారిని కాపాడారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 26 మంది ఉండగా ఐదుగురికి గాయాలయ్యాయి. చిన్నారులు కూడా బస్సులో ఉన్నారని, వారందర్నీ వెనుక అద్దం పగల కొట్టి బయటకు తీసుకొని వచ్చామని చెప్పారు స్థానికులు. 


ఉత్తరాఖండ్‌లో (Uttarakhand Accident) ఘోర ప్రమాదం
ఉత్తరాఖండ్‌లోనూ ఘోర ప్రమాదం జరిగింది. ఓ పికప్ ట్రక్కు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు పెళ్లికి హాజరై తిరుగు ప్రయాణం కాగా.. సియోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని పబౌలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. 


తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం పౌరిలోని ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. మృతులను అంకిత్ కుమార్, హయత్ సింగ్, మెహర్బాన్ సింగ్, దాబ్డే, అంబిక, కుమారి మోనికగా గుర్తించారు.