రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫైటింగ్ సీన్స్, భీమ్లా నాయక్ పవర్ ఫుల్ సీక్వెన్స్, వకీల్ సాబ్, పుష్ప, క్రాక్, అరవింద సమేత, అత్తారింటికి దారేది.. ఒకటేంటి.. ఇలా వర్సబెట్టి ఫైటింగ్ సీన్స్‌ని యాజిటీజ్‌గా దించేస్తారు ఈ నెల్లూరు కుర్రాళ్లు. యూట్యూబ్ ఛానెల్‌తో బాగా పాపులర్ అయ్యారు.
లాక్ డౌన్ టైమ్ లో సెల్ ఫోన్ తో సరదాగా మొదలైన ఈ స్పూఫ్ సీన్స్ వ్యవహారం.. ఇప్పుడు 6 లక్షల బడ్జెట్ పెట్టి రెంటుకి కెమెరా తెచ్చి, నటీనటులు, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్.. అన్నీ పెట్టి సీన్ రీ క్రియేషన్ చేసే వరకు వెళ్లింది. లేటెస్ట్ గా వీరు చేసిన ఆర్ఆర్ఆర్ ఫైటింగ్ సీక్వెన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్ వరుణ్, డీఓపీ సుభాని.. ఇలా ఒక్కొకరు ఒక్కో విభాగాన్ని లీడ్ చేస్తారు. అవసరం అనుకుంటే అందరూ ఫ్రేమ్ లో కనిపిస్తారు. లేదా చిన్న చిన్న పిల్లల టాలెంట్ ని ప్రోత్సహిస్తారు. ఇలా మొత్తం 25మంది నెల్లూరు కుర్రాళ్లు అనే పేరుతో పాపులర్ అయ్యారు.
ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషన్ అయిన వీరికి.. సినిమా ఇండస్ట్రీనుంచి కూడా మంచి స్పందన లభించింది. 2018లో సరిలేరు నీకెవ్వరు ఫైట్ సీక్వెన్స్ తో వీరి జర్నీ స్టార్ట్ అయింది, ఆ తర్వాత అనిల్ రావిపూడి ఫోన్ చేసి మరీ అభినందించారు. ఆ తర్వాత ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, హీరో నితిన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఇలా ఒకరేంటి పెద్ద పెద్ద వాళ్లే వీరిని ప్రోత్సహించారు. ఆమధ్య జబర్దస్త్ లో కూడా వీరు ఓ స్కిట్ వేసి అలరించారు.
ఫైటింగ్ సీన్స్ లోనే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకే తాము ఫైట్ సీక్వెన్స్ లనే ఎన్నుకున్నామని, పాటలు, కామెడీ సీన్ల జోలికి వెళ్లలేదని చెబుతుంటారు నెల్లూరు కుర్రాళ్లు. త్వరలో ఓన్ కంటెంట్ తో ప్రయోగాలు చేసేందుకు కూడా వీరు సిద్ధమయ్యారు. లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
పాపులార్టీ పెరిగినా.. వీరిపై నమ్మకంతో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవరూ మందుకు రాలేదు. దీంతో వరుణ్ తన కుటుంబ సభ్యుల సహకారంతో 6 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. వరుణ్ తల్లి చేపలు అమ్మి సంపాదించిన డబ్బుతో ఈ ఆర్ఆర్ఆర్ ఫైట్ సీక్వెన్స్ తీశారు.
వీరంతా 22 ఏజ్ గ్రూప్.. అందరూ క్లాస్ మేట్స్.. చిన్నప్పటినుంచి కలసి మెలసి తిరగడం, ఒకే చోట ఉండటంతో ఎక్కడా పొరపొచ్చాలు లేవు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఉండే వీరంతా.. సోషల్ మీడియాలో పాపులర్ అయినా.. లోకల్ గా మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. కలసి తిరగడం, సరదాగా పెన్నా ఒడ్డున షికార్లు చేయడం వీరికి అలవాటు.
భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీలో సెటిలవుదామనేది వీరి ఆలోచన. ఒక్కొకరు ఒక్కో ఫీల్డ్ పై ఆసక్తితో ఉన్నారు. అందరూ కలసి సినిమా ఫీల్డ్ ని దున్నేస్తామంటున్నారు. వీరికి ఎవరూ గురువులు లేరు, సినిమాలు చూసి అంతా నేర్చుకున్నారు. సెల్ ఫోన్ తోటే అన్నీ అలవాటు చేసుకున్నారు. మొదట్లో సెల్ ఫోన్ తోనే షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ అన్నీ చేసేవారు. ఇప్పుడు చిన్నగా కెమెరాకి, ప్రొడక్షన్ హంగామాకి అలవాటు పడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నమ్మకంగా చెబుతున్నారు.