ఏపీలో జిల్లాల విభజన అసంబద్ధంగా ఉందంటూ మండిపడిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Rama Narayan Reddy )తన పోరాటాన్ని మొదలు పెట్టారు. వెంకటగిరి ( Venkatagiri ) నియోజకవర్గంలోని మూడు మండలాల ప్రజలతో కలసి ఆయన నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. మూడు మండలాల ప్రజలు మొదలు పెట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాపూరు మండల ప్రజా ప్రతినిధులకు మద్దతుగా ఆయన దీక్షల్లో పాల్గొన్నారు. మూడు మండలాలను నెల్లూరులోనే ( Nellore ) ఉంచేంత వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తామన్నారు.
సూట్‌కేస్ కంపెనీలతో దుబాయ్‌లో ఎంవోయూలు - మంత్రి గౌతంరెడ్డిపై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు !
జిల్లాల విభజనకు వ్యతిరేకంగా ఆనం తిరుగుబాటు జెండా ఎగరేశారు. బుధవారం ఈ అంశంపై కలెక్టర్‌కు (Collector ) వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మట్లాడుతూ ప్రజలను పట్టించుకోకుండా జిల్లాల విభజన చేస్తే .. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ( Congress ) పరిస్థితే వైఎస్ఆర్‌సీపీకి ఏర్పడుతుందని హెచ్చరించారు. జిల్లాల అశాస్త్రీయ విభజన వల్ల సోమశిల రిజర్వాయర్ నీటి వాటాల్లో గొడవలు జరుగుతాయని... ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలిన్నారు. డిలిమిటేషన్, రాష్ట్ర విభజన సమయాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా ప్రజలు సిద్దంగా లేరని ఆనం ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్
నాగార్జున సాగర్ డ్యామ్‌పై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య జరుగుతున్న దాడుల మాదిరిగా నెల్లూరు-బాలాజీ జిల్లా పోలీసులకు సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. శాస్త్రబద్ధంగా నీళ్లు, నిధుల గురించి చట్టపరంగా ఆలోచించి జిల్లాల విభజన చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి అశాస్త్రీయ విధానం బాధ కలిగిస్తోందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గతంలో కూడా ఆనం రామనారాయణరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ గళం విప్పుతున్నారు.
జిల్లాల విభజనపై ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా పలు జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇదే తరహా ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాలు మార్చాలనో.. పేరు విషయమో.. లేకపోతే తమ నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లో చేర్చాలనో డిమాండ్లు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అభ్యంతరాల సమర్పణ గడువు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.