ఇయర్ ఫోన్ లో పాటలు వింటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టుకున్నా ఎవరూ ఏమీ అనరు. కానీ దానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నుంచి నెల్లూర వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ డ్రైవర్ మ్యూజిక్ ప్లేయర్‌లో పాటలు పెట్టాడు. ఆయన వరకు వినుకుంటే ఎవరికీ సమస్య ఉండేది కాదు. ఫుల్ వాల్యూమ్‌తో అందరి గూబలు గుయ్యమనిపించాడు.
అదే బస్సులో ఓ పసిపాపతో ఓ ఫ్యామిలీ ప్రయాణిస్తోంది. పాపకు చెన్నైలోని ఓ ఆసుపత్రి తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి పాప కాస్త ఇబ్బంది పడటం చూసిన ఆ కన్నవారిలో ఆందోళన మొదలైంది. అసలే మెదడుకు సంబంధిన సమస్యతో పాప చికిత్స పొందుతోంది. మరోసారి డాక్టర్‌కు చూపించేందుకు పాపను తీసుకెళ్తున్నారు. చిన్న సౌండ్‌కి కూడా అదిరి పడే పాప... బస్‌లో డీజే సౌండ్‌కు మరింత ఇబ్బంది పడింది.
పాప ఇబ్బందిని చూసిన చిన్నారి తండ్రి వెళ్లి డ్రైవర్‌తో మాట్లాడారు. సౌండ్‌తో అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డ ఇబ్బంది పడుతుందని వివరించారు. సౌండ్ కాస్త తగ్గించమని వేడుకున్నాడు. డ్రైవర్ చాలా తేడాగా అసలు సౌండ్ తగ్గించేది లేదని తేల్చి చెప్పేశాడు. ఎంత రిక్వస్ట్ చేసినా చిరాకు పడ్డాడే తప్ప సౌండ్ మాత్రం తగ్గించలేదా ఆర్టీసీ డ్రైవర్
బస్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా పాప తండ్రికి మద్దతుగా రాలేదు. చేసేది లేక తన సీట్లో వచ్చి కూర్చున్నాడు ఆ తండ్రి. కాసేపటికి ఆ సౌండ్‌తో అప్పటి వరకు ఇబ్బంది పడుతూ వచ్చిన పాప... ఏడుపు మొదలు పెట్టింది. గుక్కపెట్టి ఏడుస్తోంది.
పాప ఏడుపు చూసైనా ఆర్టీసీ డ్రైవర్ కనికరిస్తాడులే అనుకొని మరోసారి వెళ్లాడు చిన్నారి తండ్రి. అప్పుడు కూడా డ్రైవర్ పట్టించుకోలేదు. ఈసారి కాస్త కోపంగానే అడిగాడాయన. అటు నుంచి కూడా డ్రైవర్ అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇదెక్కడి అన్యాయమని పాప తండ్రి అడిగారు. పాపకు ఆరోగ్యం బాగాలేదు.. సౌండ్ తగ్గించమంటే మానవత్వం లేకుండా ఇలాంటి సమాధానం చెప్పడమేంటని నిలదీశారు.
అదేంటని ప్రశ్నించిన ఆ కుటుంబాన్ని మీకు దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు ఆర్టీసీ డ్రైవర్. పాప అనారోగ్యంతో ఉంది, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంటే ఏడుస్తుంది, కాస్త పాటలు ఆపండి అన్నా కూడా కనికరించలేదు. చివరకు పాప బాధ చూసి తట్టుకోలేక, డ్రైవర్‌తో వాదించలేక ఆ తల్లిదండ్రులు పాపతో కలిసి బస్ దిగిపోయారు. బస్ ఎక్కడో ఆపమంటే... వాసిలి గ్రామం వద్దకు తీసుకొచ్చి దించేశాడు డ్రైవర్.
నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు చిన్నారికి మెదడుకి సంబంధించిన చికిత్సకోసం ఆత్మకూరు నుంచి చెన్నై వెళ్లేందుకు నెల్లూరు బస్సులో బయల్దేరారు. నెల్లూరు నుంచి వారు రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది. అయితే బస్సులో డ్రైవర్‌తో గొడవ కారణంగా వారు మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చింది.
ఈ గొడవ కారణంగా వాళ్లు నెల్లూరు చేరుకోవడం లేట్ అయింది. దీంతో వాళ్లు చెన్నై వేళాల్సిన ట్రైన్ వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కన్నవారు తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూసి కంగారు పడుతున్నారు. పాపకు వ్యాధి తిరగబెట్టిందని త్వరగా చెన్నై తీసుకెళ్లకుంటే ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు.
దీనంతటికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. డ్రైవర్ వ్యవహారం సరిగా లేదన.ి.. ఆత్మకూరు బస్ డిపో మేనేజర్‌కు లిఖిత పూరకంగా ఫిర్యాదు చేశారు.