Nellore Zika virus:  నెల్లూరు జిల్లాలో ఓ బాలుడికి జికా వైరస్ నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి వైరస్ సోకినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. బాలుడిని  నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వైరస్‌ నిర్ధారణ తరువాత చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. వెంటనే అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ వైద్యుల బృందాన్ని వెంకటాపురంసకు పంపించారు. జికా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా సోకిందన్నదానిపై ఆరా తీస్తున్నారు.  


జికా వైరసా్ పాజిటివ్ వచ్చిన  బాలుడి స్వగ్రామంలో అందిరకీ వైద్య పరీక్షలు                   


వ్యాధి సోకిన బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు.  గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని… గ్రామంలో మొత్తం 150 గృహాలు ఉన్నాయన్నారు. ప్రతి కుటుంబానికీ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము. పుకార్లను నమ్మవద్దని అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.                         


Also Read: టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?


ఆడ దోమ ద్వారా వ్యాపించే జికా వైరస్             


జికా వైరస్‌ సోకిన ఆడ ఐడిస్‌ దోమ (Aedes mosquito) కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌ దేశాలతోసహా భారత్‌, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌‌, థాయ్‌లాండ్‌, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్‌ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.



Also Read: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024