నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మర్రిపాడు సచివాలయంలో జరిగిన ఓటిఎస్ అవగాహన కార్యక్రమంలో ఆమె ప్రజలు బుద్ధి వాడట్లేదంటూ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ ఉంటే ఉచిత పట్టాలు, రుణమాఫీలు ఎందుకు ఇవ్వలేదంటూ ఎంపీడీవో విమర్శలు గుప్పించారు. ప్రజలు తమ బుద్ధిని ఉపయోగించాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైసీపీ పాలనను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇటీవలే ఎంపీడీవో ఓటీఎస్ పై ఇచ్చిన ఓ ఆడియో మెసేజ్ వైరల్ గా మారింది. ఓటీఎస్ కి డబ్బులు చెల్లించని వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దంటూ ఆమె అధికారుల గ్రూపుల్లో ఆడియో మెసేజ్ పెట్టారు. అది కాస్తా వైరల్ గా మారడంతో జాయింట్ కలెక్టర్ ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ క్రమంలో మరోసారి ఓటీఎస్ పై ఎంపీడీవో సుస్మితారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది.
Also Read: 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !
ఓటీఎస్ పై టార్గెట్లు
మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ కు గతంలో టార్గెట్ పెట్టారు. గ్రామ కార్యదర్శుల, వీర్వోలకు, డిజిటల్ అసిస్టెంట్లకు టార్గెట్లు పెడుతూ మూడ్రోజుల క్రితం ఓ హుకూం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో రోజుకు కనీసం పది చొప్పున ఓటీఎస్లు పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్ కట్టని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు పెట్టవద్దన్నారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ వివరణ ఇవ్వాలని మర్రిపాడు ఎంపీడీవో సుస్మితా రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎంపీడీవో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఓ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వాన్ని విమర్శించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి