ABP  WhatsApp

Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా మొత్తం ఎన్నికల కోడ్, ఆత్మకూరు ఉపఎన్నిక కోసం పగడ్బందీ ఏర్పాట్లు

ABP Desam Updated at: 27 May 2022 03:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

NEXT PREV

Atmakur Byelection 2022 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉపఎన్నిక సందర్భంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా మొత్తం ఇప్పటికే ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చిందని చెప్పారు. జూన్‌ 28వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్లను(VV PATs) సిద్ధం చేశామని వివరించారు. ఉపఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా జేసీ హరేంధిర ప్రసాద్‌ వ్యవహరిస్తారన్నారు. జిల్లాలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ అందుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 



  • ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు



జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికలకు సంబంధించి 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకు అన్ని సదుపాయాలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. దీనిలో 279 పోలింగ్ కేంద్రాలు(Polling Centers) ఉండబోతున్నాయి. కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తాం. డీఎమ్.హెచ్వోను నోడల్ అధికారిగా నియమిస్తున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. అలాగే ఈ ఎన్నికల్లో 80 ప్లస్ వయసున్న వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటుచేస్తాం. పోస్టల్ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉంచుతాం. విభిన్న ప్రతివంతులను పీడబ్ల్యూడీ యాప్ ద్వారా మార్క్ చేసి వారిని పోలింగ్ బూత్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం - చక్రధర్ బాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్



  • ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్


దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్(Election Notification) విడుదలైంది. ఇందులో ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) అకాల మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే అధికార వైఎస్సార్‌సీపీ(Ysrcp) ఇక్కడ గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి(Mekapati Vikram Reddy)ని అభ్యర్థిగా ప్రచార బరిలోకి దింపింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా విక్రమ్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు. 



  • ఉప ఎన్నికల షెడ్యూల్ 


నామినేషన్ల ప్రారంభం  మే 30, 2022


నామినేషన్ల చివరి తేదీ  జూన్ 6, 2022


ఎన్నికల తేదీ    23 జూన్, 2022


కౌంటింగ్, ఫలితాల ప్రకటన  26 జూన్, 2022

Published at: 27 May 2022 03:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.