పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(NGT) ఆదేశించింది. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని ఎన్జీటీ తెలిపింది. ఈ కమిటీ 4 నెలల్లో ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు అవసరం లేదని తెలిపింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు అవసరం లేదని ఎన్‌జీటీ తెలిపింది. శుక్రవారం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. పర్యావరణ ఉల్లంఘన జరిగితే రాష్ట్రానిదే బాధ్యతని పేర్కొంది.


Also Read: బాలయ్య ఇలాకాలో వైసీపీ నేతల డిష్యుం డిష్యుం! ఇలాగైతే కష్టమే..!


అనుమతులు లేకుండా నిర్మాణం వద్దు


రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ-తెలంగాణ మధ్య వివాదం నెలకొంది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని తెలంగాణ ఆరోపిస్తుంది. ఈ వివాదంపై గత కొంత కాలంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని తెలంగాణ ఆరోపిస్తుంది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు తీసుకున్నాకే రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపి వేయాలని సూచించింది.


Also Read:  పీఆర్సీ కూడా ప్రకటించలేదు ... ఉద్యమం నిలిపివేత ! ఏపీ ఉద్యోగ నేతలు ఏం సాధించారు ?


రాయలసీమ ఎత్తిపోతల కొత్త పథకం కాదు


ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తో జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైచెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న గ్రీన్ ట్రైబ్యునల్ శుక్రవారం వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసులో వైఖరి ఏంటో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ తమ అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పాత పథకమే ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీని వల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏంలేదని కేంద్రం స్పష్టం చేసింది. గత ప్రాజెక్ట్ లకు ఫీడర్ గా మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పనిచేస్తుందని పేర్కొంది. 


Also Read: పార్లమెంట్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందే.. ఏపీ ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు పవన్‌ కొత్త వ్యూహం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి