బాలయ్య కోట హిందూపురంలో జాగ్రత్తగా పార్టీని పటిష్ఠం చేయాల్సిన వైసీపీ నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇద్దరి ముఖ్య నేతల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మాటలు, ఆరోపణల యుద్ధం అధికార పార్టీలో ఇరు నేతల మధ్య ఆధిపత్య ధోరణి కోసం ఏ స్థాయిలో పోరాటం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఎంఎల్సీ ఇక్బాల్, ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య గత వారం నుంచి జరగుతున్న పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.


ఇటీవల మండల పార్టీ కన్వీనర్ల నియామకంపై ఎంఎల్సీ ఇక్బాల్.. ఆగ్రోస్ కార్పొరేషన్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్ ఇద్దరు కూడా వేరువేరుగా తమ అనుచరులను మండల పార్టీ కన్వీనర్లుగా ప్రకటించారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. తాము ప్రకటించిన వారినే అధిష్ఠానం నుంచి కూడా ప్రకటించేందుకు ఇరు నేతలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకు ఇద్దరి మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారింది. తమ వారిని ప్రకటించేందుకు నేతలు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఎంఎల్సీ ఇక్బాల్ పై నియోజకవర్గంలోని మరో బలమైన సామాజికవర్గ నేతలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.


ఇక్బాల్ ఎవరిని కలుపుకుపోరు అంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక్బాల్ ను ఒంటరి చేసేందుకు నవీన్ నిశ్చల్.. వేణుగోపాల్ రెడ్డి లాంటి మిగిలిన నేతలంతా కలిసి పనిచేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నవీన్ నిశ్చల్ గతంలో తన స్థానంలో వేరొకరని ఇంచార్జ్ గా ప్రకటించడంతో హర్ట్ అయ్యి తెలుగు దేశంలో చేరేందుకు టీడీపీ నేతతో మాట్లాడిన ఆడియోను ఇటీవలే ఇక్బాల్ వర్గం కావాలనే లీక్ చేయించి నవీన్ నిశ్చల్ పార్టీకి విధేయుడు కాదన్న మెసెజ్ పంపేందుకు చేసిన ప్రయత్నాలు హిందూపురంలో తీవ్రమైన చర్చకు కారణమవుతుంది.


ఆయన ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చాడు..కానీ తెలుగుదేశం అధికారంలో వున్నపుడు పార్టీని కష్టకాలంలో నడిపిన తనను పక్కనపెట్టి.. ఇక్బాల్‌కు సీటిస్తే ఆయన అందరిని కలుపుకొని పోవడంలో విఫలం అయ్యాడంటూ నవీన్ నిశ్చల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా అందరూ మూకుమ్ముడిగా ఇక్బాల్ పై ఆరోపణలు చేస్తూ అదిష్ఠానానికి కంప్లైంట్ చేస్తున్నారు. కావాలనే తమను ఇబ్బందికి పెట్టేందుకు ఇక్బాల్ వర్గం చేస్తున్న మాటల దాడి, గతంలో ఎప్పుడో జరిగిన వాటిపై ఇప్పుడు ప్రచారం చేస్తూ తమ క్యారెక్టర్ ను  దిగజార్చే ప్రయత్నం చేయడంపై సీరియస్ గా వుంది నవీన్ నిశ్చల్ వర్గం. అయితే నియోజకవర్గం ఇంచార్జ్‌గా మండల పార్టీ కన్వీనర్లుగా ప్రకటించే అధికారం తమకే వుంటుందని, కానీ ఇందులో నవీన్ నిశ్చల్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వారిని ప్రకటించడమే వివాదానికి కారణం అని ఇఖ్బాల్ వర్గం ఆరోపిస్తుంది.


టీడీపీలో బాలయ్య కంచుకోటలో ఇలా నేతల మద్య ఆధిపత్య పోరు పార్టీకి ఏమాత్రం మంచిది కాదని అదిష్ఠానం హితబోద చేస్తున్నప్పటికి నేతల మద్య మాత్రం ఏమాత్రం సయోధ్య కుదరడం లేదు. మరోవైపు, మరో రెండేళ్ళలో  ఎన్నికలు దగ్గరవుతున్ననేపథ్యంలో నేతల మద్య జరగుతున్న గొడవలు పార్టీకి మంచిది కాదని కార్యకర్తలు కూడా చెప్తున్నారు.


Also Read: Suicide: అనుమానపు మొగుడి టార్చర్‌.. భరించలేక పోయింది నవ వధువు.. చివరకు..


Also Read: Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. స్నాప్‌ చాట్‌ లో పరిచమైన వ్యక్తితో లాంగ్ డ్రైవ్.. ఆ తర్వాత




 



Also Read: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు


Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి