AP Mega DSC Results: అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం ఉదయం విడుదల చేసింది. 16, 347 ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు తుది జాబితా విడుదల చేశారు. జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాల విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మరో వాగ్దానం నెరవేరిందన్నారు. 

Continues below advertisement

చంద్రబాబు తొలి సంతకం ఏపీ మెగా డీఎస్సీ..

అమరావతి సచివాలయంలో ఏపీ సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొట్టమొదటి ఫైల్ మెగా DSC అని లోకేష్ గుర్తుచేసుకున్నారు. 150 రోజుల కంటే తక్కువ సమయంలో పాఠశాల విద్యా శాఖ ఏపీ మెగా డీఎస్సీ 2025 (AP Mega DSC)ను విజయవంతంగా పూర్తిచేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తుది ఎంపిక జాబితాలో పేర్లు ఉన్న విజయం సాధించిన అభ్యర్థులందరికీ నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయడం.  సెలక్షన్ లిస్ట్‌ లింక్ ఇదే 

Continues below advertisement

ఏపీ డీఎస్పీ ఫలితాలు తుది జాబితా అధికారికంగా సెప్టెంబర్ 15న ఉదయం 9:30 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.inలో అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ మైలురాయి బాధ్యతతో పాటు మా పాలనలో పారదర్శకతకు నిదర్శనం. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, AP మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను అభివృద్ధి పథంలో నడిపేందుకు మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు జరగాలని భావించినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.

ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న మంత్రి లోకేష్

ఈ కొత్త టీచర్లకు స్వాగతం పలుకుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుకు వారు మార్గదర్శకత్వం వహించాలి. వారు ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వారికి సైతం మార్గనిర్దేశం చేయాలని సీనియర్ టీచర్లకు పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో డీఎస్సీలో పోస్టులు సాధించని వారు నిరుత్సాహపడవద్దని.. హామీ ఇచ్చినట్లుగా, DSC ప్రతి సంవత్సరం నిర్వహించి అవసరాలకు తగ్గట్లుగా టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పుడు పోస్టులు రాని డీఎస్సీ అభ్యర్థులు మరింత దృఢ సంకల్పంతో సిద్ధంగా ఉండాలని.. మీ అవకాశం కోసం వేచి చూడాలని సూచించారు.