National Engineers Day 2025 : ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారత రత్న అవార్డు గ్రహీత గ్రేట్ ఇంజనీర్ సర్​ ఎం. విశ్వేశ్వరయ్య (Sir M. Visvesvaraya)జ్ఞాపకార్థం దీనిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. లే ఆఫ్​లు పెరుగుతున్న ఈరోజుల్లో ఇంజనీరింగ్లో కెరీర్ చూజ్ చేసుకోవడం మంచి ఆప్షనేనా? దానిలోనే రాణించాలంటే ఎలాంటి బ్రాంచ్​లు సెలక్ట్ చేసుకోవాలి? ఈ కాలంలో ఇంజినీరింగ్​ కెరీర్​గా ప్రాముఖ్యత ఉందా లేదా ఇప్పుడు చూసేద్దాం. 

భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. వీరికి జాబ్స్ దొరకడం అనేది చాలా కాంపిటేషన్​తో కూడుకున్నది. పోటీ పక్కన పెడితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మరికొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇంజనీర్లు AI, రోబోటిక్స్, రిన్యువబుల్ ఎనర్జీ, స్పేస్ టెక్, స్మార్ట్ సిటీస్ వంటి వాటిపై ఫోకస్ చేస్తే ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. 

ఇంజినీరింగ్ కెరీర్​గా మార్చుకోవాలంటే.. 

ఇంజినీరింగ్​లో రాణించాలన్నా.. ఫ్యూచర్​ దానిలోనే చూసుకోవాలన్నా సరైన నైపుణ్యాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్​తో పాటు ఇంటర్న్​షిప్స్, కోడింగ్, ఇన్నోవేషన్ వంటివాటిపై ఫోకస్ చేస్తే ఇంజినీరింగ్ ఇంకా సేఫ్​గా, రెస్పెక్టెడ్ ప్రొఫెషన్​గానే ఉంటుంది. ఇవేమి లేకుండా కెరీర్​ ఇంజినీరింగ్​లో చూసుకోవాలంటే కష్టమే అవుతుంది. 

భవిష్యత్తు ఉన్న బ్రాంచులు ఇవే.. (Best Engineering Branches in India 2025)

ఫ్యూచర్​లో మంచి అవకాశాలు పొందాలనుకుంటే మీరు ఇంజినీరింగ్​లో కొన్ని బ్రాంచ్​లు (Future of Engineering Careers in India) ఎంచుకోవాల్సి ఉంది. కంప్యూటర్ సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (CSE + AI/ML) మంచి బ్రాంచ్ అవుతుంది. సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోకి వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్. ఎక్కువ ప్లేస్‌మెంట్లు, మంచి ప్యాకేజీలతో పాటు మంచి అవకాశాలు కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) కూడా మంచి ఆప్షనే. చిప్ డిజైనింగ్, IoT, 5G/6G టెలికాం, రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో స్కోప్ ఉంటుంది. ఇండియాలో సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ (ME) ట్రెడీషనల్ బ్రాంచ్ అయినా సరే.. ఆటోమొబైల్, ఏరోస్పేస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ & ఆటోమేషన్ వల్ల మెకాట్రానిక్స్, రోబోటిక్స్ వైపు కూడా ఈ మధ్యకాలంలో దీనికి స్కోప్ పెరుగుతోంది.

స్మార్ట్ సిటీస్, మెట్రో ప్రాజెక్ట్స్, హైవేస్, గ్రీన్ బిల్డింగ్స్‌కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ (CE) కూడా మంచి ఆప్షన్. పర్యావరణ, సస్టైనబుల్ కన్‌స్ట్రక్షన్ రంగాల్లో కూడా మంచి స్కోప్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) తీసుకుంటే రిన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, రోబోటిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. సోలార్, విండ్ పవర్‌కి ఇండియాలో పెద్ద ఎత్తున డిమాండ్ రానుంది. కరోనా తర్వాత బయోటెక్, మెడికల్ డివైసెస్, జనెటిక్ ఇంజనీరింగ్, స్టార్టప్స్ రంగాల్లో బాగా డిమాండ్ ఉంది. కాబట్టి బయోటెక్నాలజీ & బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయవచ్చు. 

వీటిని మరచిపోకండి.. 

ఇంజనీరింగ్​లో కెరీర్​ ముందుకు తీసుకువెళ్లాలనుకునే విద్యార్థులు బ్రాంచ్​ని బంధువులు, ఫ్రెండ్స్ సలహా మీద ఎంచుకోకూడదు. మీ ఇంట్రెస్ట్, మార్కెట్ డిమాండ్ చూసుకుని ఎంచుకుంటే మీరు మంచిగా రాణించగలుగుతారు. కోడింగ్, డేటా అనలిసిస్, AI, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్​డేట్ చేసుకుంటూ సర్టిఫికేషన్లు సంపాదిస్తే కెరీర్​లో సక్సెస్​ఫుల్​గా ముందుకు వెళ్తారు.