Nara Lokesh Hindi Contro:  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హిందీ రాజకీయాలు నడుస్తున్నాయి.  హిందీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చాలా మంది విమర్శలు చేశారు. తాజాగా ఓ జాతీయ మీడియా చానల్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ లో నారా లోకేష్ హిందీకి మద్దతుగా మాట్లాడారు. గతంలోనూ మాట్లాడారు కానీ.. ఆయన హిందీని జాతీయ భాషగా చెప్పడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  నిజానికి ఆ ప్రశ్నలో యాంకర్.. అది జాతీయ భాష కాదని చెబుతున్నారు.  అయినా నారా లోకేష్..  అది జాతీయ భాష అనే చెప్పారు. 

Continues below advertisement





 


భారతదేశానికి ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలున్నాయి... అందులో ఏ ఒక్కటీ జాతీయభాష కాదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.  





 ఈ విషయంలో టీడీపీ కార్యకర్తలు కూడా లోకేష్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. హిందీని బలవంతంగా రుద్దవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. 



తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు హిందీని దక్షిణ భారత ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారుని కొంత మంది గుర్తు చేస్తున్నారు.  1989 అక్టోబర్ లో విడుదల చేసిన నేషనల్ ఫ్రంట్ మానిఫెస్టోలో కూడా అదే అంశాన్ని స్పష్టంగా చెప్పారని. ..అలాంటి వారసత్వం ఉన్న నారా లోకేష్    హిందీ భాష కి మద్దతుతా మాట్లాడం ఏమిటని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. 





హిందీని నేర్చుకుంటే తప్పేమీ లేదాని.. భాషకు రాజకీయాలు అన్వయించడం సరి కాదని టీడీపీ విధానం. అయితే నారా లోకేష్ వ్యక్తం చేసిన అభిప్రాయంలో  అధికార భాషగా చెప్పాల్సిన మాటను.. జాతీయ భాషగా చెప్పడంతో  నెటిజన్లు ఇక దొరికారు కదా... ట్వీట్లతో దాడి చేసేస్తున్నారు.