AP Govt Schools:  డిసెంబ‌ర్ 7న నిర్వ‌హించ‌బోయే త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా స‌మావేశాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా విజ‌య‌వంతం చేయాల‌ని ఏపే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలను కోరారు.ప్ర‌జాప్ర‌తినిధులు, దాత‌లు, పూర్వ‌విద్యార్థులు, స్వ‌చ్చంద సంస్థ‌ల‌ను ఆహ్వానిస్తూ  లేఖ  విడుద‌ల చేసిన  మంత్రి నారా లోకేష్ పాఠ‌శాల విద్యావ్య‌వ‌స్థ‌కే అతి పెద్ద పండుగ‌గా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ జరపాలని విద్యాశాఖ ను ఆదేశించారు.


డిసెంబర్ 7 ప్రభుత్వ స్కూళ్లలో టీచర్, పెరెంట్స్ మీటింగ్స్                      


డిసెంబ‌ర్ 7వ తేదీన  జరిగే త‌ల్లిదండ్రులు-ఉపాధ్యాయ స‌మావేశం పాఠ‌శాల‌ల బ‌లోపేతానికి, విద్యార్థి వికాసానికి, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందని,విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఓ ఆత్మీయ వార‌ధిని నిర్మిస్తుందని ఆయన తన లేఖ లో పేర్కొన్నారు.ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంప‌వ‌ర్ ల‌క్ష్యాల‌తో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర‌మంతా ఒకేసారి డిసెంబ‌ర్ 7న విద్యార్థుల త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశం పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించామన్నారు.             



Also Read: Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు




వార్డు స‌భ్యుల నుంచి పార్ల‌మెంటు స‌భ్యుల వ‌ర‌కూ...స‌ర్పంచ్ నుంచి ముఖ్య‌మంత్రి వ‌ర‌కూ ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ రాజ‌కీయాల‌కు అతీతంగా..అంతా ఒకే పాఠ‌శాల‌లో కాకుండా, వారి వారి గ్రామాల పాఠ‌శాల‌ల్లో జ‌రిగే మెగా పేరెంట్-టీచ‌ర్ మీటింగ్‌లో పాల్గొనాల‌ని నారా లోకేష్ పిలుపునిచ్చారు.  ఈ స‌మావేశం ద్వారా పిల్ల‌ల చ‌దువు, ప్ర‌వ‌ర్త‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ త‌ల్లిదండ్రులు తెలుసుకోవ‌చ్చు. పిల్ల‌ల స‌మ‌స్య‌లు, అభ్య‌స‌నా సామ‌ర్థ్యాలు, క్రీడలు, క‌ళ‌లు ప‌ట్ల ఆస‌క్తులను టీచ‌ర్ ముందుంచి వారిని మ‌రింత‌గా ఆయా అంశాల్లో ప‌రిణ‌తి సాధించేలా ప్రోత్స‌హించ‌వ‌చ్చునన్నారు. 


Also Read:  సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు


రాజకీయాలకు తావు లేదు !  


విద్యావ్య‌వ‌స్థ‌ను రాజ‌కీయాలకు దూరంగా ఉంచ‌డం.. విద్య నేర్చుకునే పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను పాఠ‌శాల‌ల‌కు ద‌గ్గ‌ర చేయ‌డం అనేది  ప్ర‌భుత్వం ల‌క్ష్యం అని తెలిపారు.పేరెంట్- టీచ‌ర్ మీటింగుకి హాజ‌ర‌య్యే ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా..  పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకుని రావొద్ద‌ని మాత్రం విజ్ఞ‌ప్తి చేసారు.పాఠ‌శాల‌ల‌కు విరాళాలు ఇచ్చిన దాత‌లు,  పాఠ‌శాల‌ల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే పూర్వ‌విద్యార్థులు, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు కూడా డిసెంబ‌ర్ 7న జ‌ర‌గ‌బోయే మెగా పేరెంట్-టీచ‌ర్ మీటింగ్ లో భాగం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుతూ అంద‌రికీ  ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నట్టు లోకేష్ చెప్పారు.