Nara Lokesh :  టీడీపీ నేతలపై వివిధ  ప్రాంతాల్లో  జరుగుతున్న దాడులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు  చేసిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. విజయ్ గోపాల్‌ను వైసీపీ సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని… అవే చెప్పులతో ప్రజలే వారిని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చ‌రించారు. అధికార పార్టీ నాయకులు ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.      


18 ఏళ్లు దాటిన మహిళలందరికి 18వేలు ఆర్థికసాయం, నేడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ 


మంద విజయ్ గోపాల్ పై  వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.                        


 





 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వేలాది మందిపై వైసీపీ సైకోలు దాడులకు పాల్పడ్డారని  లోకేష్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దాడికి పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని లోకేశ్ హెచ్చరించారు. రాజకీయ కక్షసాధింపులో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు వరుసగా దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.           


చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసుల వివరాలేంటీ? అవి ఏ పొజిషన్‌లో ఉన్నాయి?                                              


న్యాయం చేయాల్సిన పోలీసులు చివరకు దాడికి గురైన బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమన్నారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై స్థానిక వైసీపీ నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి రాళ్లదాడికి పాల్పడటాన్ని లోకేశ్ ఖండించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.