Anand Mahindra for investments in AP: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నారా లోకేష్.. టాప్ ఇండస్ట్రిలియస్ట్స్‌తో టచ్ లో ఉండేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మహింద్రా గ్రూపు తమ కంపెనీకి సంబంధించిన ఓ ప్రకటనను తెలుగులో రూపొందించింది. ఒక్క నిర్ణయం చాలు...మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ మార్చండి. మీ విధిని వశం చేసుకోండి అని ఆనంద్ మహింద్రా తన సోషల్ మీడియా అకౌంట్‌లో దాన్ని షేర్ చేశారు. ఆ ప్రకటనపై నారా లోకేష్ స్పందించారు. తెలుగు ప్రకటన చాలా నచ్చింది సార్. మీ వాహనాలకు ఏపీ పెద్ద మార్కెట్. ఏపీలో అధునాతన ఆటోమోటివ్ ఎకో సిస్టమ్, పెద్ద మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సన్ రైజ్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్రా ప్లాంట్ ను ప్రారంభించాలని కోరారు. ఏపీకి వస్తే.. ఉన్న అవకాశాలను తెలియచేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు.
లోకేష్ ఆఫర్ పై ఆనంద్ మహింద్రా కూడా వెంటనే స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని.. ఏపీ జర్నీలో తాము కూడా భాగం అవుతామన్నారు. వివిధ రంగాల్లో కలిసి పని చేసేందుకు తమ బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయన్నారు. సోలార్, మైక్రో ఇరిగేషన్, టూరిజంవంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది...ముందు ఏమి ఉందో చూద్దామని తెలుగులో రిప్లై ఇచ్చారు.
ఈ వారంలోనే నారా లోకేష్ కర్ణాటకలో ఏరో స్పేస్ పార్క్ భూ సేకరణను అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో వెంటనే లోకేష్ స్పందించారు. తమ వద్ద భూమి అందుబాటులో ఉందని.. రావాలని ఏరో కంపెనీలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో కర్ణాటక పరిశ్రమల మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. తాము భూసేకరణనుక్యాన్సిల్ చేశాం కానీ ఏరో స్పేస్ పార్క్ ని కాదన్నారు. తమ వద్ద మంచి ఎకోసిస్టం ఉందన్నారు.