Maruti Ertiga Price, Down Payment, Loan and EMI Details: మారుతి సుజుకి బ్రాండ్‌లో బెస్ట్ సెల్లింగ్ కారు ఎర్టిగా. ఇటీవల, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా ఈ కంపెనీ అప్‌డేట్ చేసింది. అంటే, కొత్త తయారయ్యే అన్ని ఎర్టిగా కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్‌లు అందిస్తోంది అన్నమాట. ఇది ఒక 7-సీటర్ కారు, పెద్ద ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది. అంతేకాదు అద్భుతమైన మైలేజీని కూడా ఇస్తుంది. మీరు మీ పెద్ద ఫ్యామిలీతో కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, ఈ విశాలమైన కారులో ప్రయాణం ఏమాత్రం అసౌకర్యంగా ఉండదు.
మీరు మారుతి ఎర్టిగాను కొనాలని ప్లాన్ చేస్తుంటే, దాని కోసం పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కొంత డౌన్ పేమెంట్ చేస్తే మిగతా అమౌంట్‌ను EMI ద్వారా చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 8,96,501 రూపాయలు. హైదరాబాద్‌లో, దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 10.65 లక్షలు. ఇందులో, RTO ఛార్జీలు దాదాపు 1.28 లక్షలు, బీమా దాదాపు రూ. 39,000, ఇతర ఖర్చులు కలిసి ఉన్నాయి ఇది మీకు కొనుగోలు చేసే నగరం బట్టి మారిపోతుంది. స్థానిక డీలర్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.
మీరు, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఎర్టిగా యొక్క బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, కేవలం రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే చాలు. మిగిలిన రూ. 8.65 లక్షలకు మీరు బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకోవాలి. ఈ లోన్ మీద బ్యాంక్ 9 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుందని భావిద్దాం. బ్యాంక్ లోన్‌ను తిరిగి చెల్లించడానికి మీకు సూటయ్యే EMI ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
7 సంవత్సరాల్లో రుణం తీర్చే ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే, నెలకు రూ. 13,917 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
6 సంవత్సరాల్లో లోన్ మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 15,592 EMI బ్యాంక్‌లో జమ చేయాలి.
5 సంవత్సరాల రుణ కాలపరిమితిని ఎంచుకుంటే, నెలకు రూ. 17,956 EMI బ్యాంక్‌కు కట్టాలి.
4 సంవత్సరాల్లో రుణం మాఫీ చేయాలనుకుంటే, నెలకు రూ. 21,526 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
మారుతి ఎర్టిగా మైలేజ్ & ఫీచర్లుఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైంది, ఈ 7-సీటర్ కారు ఇంజిన్ కెపాసిటీ 1462 cc. ఈ ఇంజిన్ గరిష్టంగా 101.64 bhp శక్తిని & 136.8 Nm గరిష్ట టార్క్‌ను ఇస్తుంది. దీనికి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉంది. కంపెనీ ప్రకారం, ఈ కారు, లీటరు పెట్రోల్‌తో 20.51 కి.మీ మైలేజీని అందిస్తుంది. మారుతి ఎర్టిగా CNG వేరియంట్ కిలోకు దాదాపు 26.11 km మైలేజీని ఇస్తుంది.
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ప్లే ప్రో సిస్టమ్, 6-స్పీకర్ ఆర్కామిస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండు & మూడు వరుసలకు రియర్ AC వెంట్స్, ఎత్తును సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, రిక్లైనింగ్ & స్లైడింగ్ రెండో వరుస సీట్లు వంటివి మారుతి ఎర్టిగాలో కనిపించే ఆధునిక ఫీచర్లు.