Nara Bhuvaneswari :    నిజం గెలవాలి పేరుతో తాను చేస్తున్న యాత్రకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని నారా భువనేశ్వరి తెలిపారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నా అని నారా భువనేశ్వరి అన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో మాకు ఎంతో ఊరటనిస్తోంది అని తెలిపారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని ట్వీట్ చేశారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానని అన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని..నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నా అని భువనేశ్వరి తన ట్వీట్‌లో నమ్మకం వ్యక్తం చేశారు. 


 





 


తిరుపతి జిల్లాలో మూడో రోజు నిజం గెలవాలి యాత్రను నారా భువనేశ్వరి కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇస్తున్నారు.  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో.. ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నారావారిపల్లి నుంచి రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంకు బయలుదేరారు. అదే విధంగా ఏర్పేడు మండలం మునగలపాలెం చేరుకుని వసంతమ్మ కుటుంబ సభ్యులకు, శ్రీకాళహస్తి రూరల్‌ మండల పరిధిలోని పొలి గ్రామంలో మునిరాజా కుటుంబ సభ్యులను నేడు పరామర్శించారు.                                  


'నన్ను అంతమొందించేందుకు కుట్ర' - ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ


శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని పాత ఆర్డీవో కార్యాలయం వద్ద నిజం గెలవాలి సభలో భువనేశ్వరి ప్రసంగిస్తారు. పార్టీపై ఉన్న మమకారం, అధినేతపై అభిమానంతో ఉంటూ వచ్చిన ఆత్మీయులను పోగొట్టుకోవడం ఎంతో బాధగా ఉందని, అన్ని వేళల్లోనూ పార్టీ అండదండలు పుష్కలంగా ఉంటాయంటూ ధైర్యం చెప్తూ భువనేశ్వరి ముందుకు కదులుతున్నారు.                                                   


ఏ క్షణమైనా కాంగ్రెస్ రెండో జాబితా - 45 మంది పేర్లు ఖరారు చేశామన్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ !