Nandyal Beer Bottle Plastic Spoon: సీల్డ్ బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్ చూసి షాక్ అయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన నంద్యాల జిల్లా డోన్ లో చోటుచేసుకుంది. డోన్ పట్టణంలోని బేతంచెర్ల సర్కిల్ లో ఉన్న వైన్ షాప్ లో యువకుడు బీరును కొనుగోలు  చేశాడు. ఆ బీరు బాటిల్ ని తీసుకున్న యువకుడు లోపల ఏదో తెల్లగా ఉంది అని గమనించాడు. అదేంటో అర్థం కాకపోవడంతో సెల్ ఫోన్ కు ఉన్న టార్చ్ లైట్ వేసి చూడగా అది ప్లాస్టిక్ స్పూన్ గా గుర్తించాడు. 


వెంటనే ఆ యువకుడు తాను విక్రయించిన షాపు వద్దకు వెళ్లి ఇందులో స్పూను ఉంది అని ప్రశ్నించగా షాపు సిబ్బంది మాత్రం అది తమకు ఏ సంబంధం లేదని తేల్చేశారు. తాము కేవలం వాటిని విక్రయించే వారు మాత్రమేనని వెల్లడించారు. అనంతరం ఆ యువకుడు సెబ్ ఆఫీసులో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లాడు. అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ విషయంపై స్పందించకపోగా.. ఇది తమకు సంబంధం లేదు మీరు నంద్యాల వెళ్లి ఫిర్యాదు చేసుకోండి.. అని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. 


దీంతో ఆ యువకుడు వెనుతిరిగాడు. ఈ విషయంపై ఎవరు స్పందించకపోవడంతో ఆ యువకుడు మద్యం దుకాణం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపిస్తూ ఇందులో ఇప్పుడు స్పూన్ మాత్రమే వచ్చింది స్పూన్ కాకుండా వేరే ఏది వచ్చినా అనారోగ్యం పాయ్యేవాళ్లమని ఆవేదన చెందాడు. ఆ మధ్యాహ్నమే తాము దాన్ని తాగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆ యువకుడు ప్రశ్నించాడు.