YS Viveka Case  :  వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన  వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీై కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 5కి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఐదు మంది నిందితులను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచింది. ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిను సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచింది. భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణంతో హాజరు కాలేకపోయారని న్యాయవాదులు తెలిపారు.   విచారణకు అప్రూవర్ దస్తగిరి హాజరు కాలేదు. తదుపరి విచారణను 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 


ప్పటికే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్                             


అవినాష్ రెడ్డిని  సీబీఐ అరెస్ట్ చేయకుండా  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇందు కోసం నాలుగు షరతులు పెట్టింది. పూచీకత్తులతో పాటు ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లవద్దని  షరతులు పెట్టింది.  వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది.  అరెస్టు చేసిన‌ట్లు అయితే రూ. 5 ల‌క్ష‌ల పూచీక‌త్తుతో బెయిల్‌పై విడుద‌ల‌కు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. సీబీఐకి అవ‌స‌ర‌మైన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.


అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తుడిచేశారనేందుకు ఆధారాలు లేవన్న న్యాయమూర్తి                        


అవినాష్ రెడ్డి దర్యాప్తులో కలగజేసుకున్నారనేందుకు ఏ విధమైన ఆధారం లేదా ఆరోపణలు కూడా లేవని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. సాక్ష్యాల్ని ధ్వంసం చేయడంలో కీలకపాత్ర పోషించినట్టుగా సీబీఐ అతనిపై అభియోగాలు మోపినా.వాటిని ఆన్ రికార్డ్ చేసేలా సీబీఐ రుజువు చేయలేకపోయిందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ కార్యాలయానికి ఉదయం 10 గంటల్నించి సాయంత్రం 5 గంటల మధ్యలో అవినాష్ రెడ్డి వెళ్లాలని, సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని కోర్టు షరతులు విధించింది. 


న్యాయపోరాటం చేస్తున్న వైఎస్ వివేకా కుమార్తె సునీత                      


మరో వైపు తండ్రిని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ వదిలి పెట్టబోనని న్యాయపోరాటం చేసేందుకు వైఎస్ సునీత సిద్ధమయ్యారు. గంగిరెడ్డి  బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేసి..బెయిల్ రద్దు చేయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులోనూ వెకేషన్ బెంచ్ విచారణలు జరుగుతున్నందున .. సెలవులు అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు