Janasena Nagababu :  తిరుమల పుణ్యక్షేత్రానికి స్వయం ప్రతిపత్తి ఉండాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్  చేశారు. తి రుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. దేశంలోనే ప్రముఖ క్షేత్రం తిరుమలలో  ఇటీవల అపవిత్రమవుతోందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత వస్తువులు, అన్యమత ప్రచారం, మాంసం, సిగరెట్లు, మద్యం లభిస్తున్నాయి. దీంతో తిరుమల పవిత్రత దెబ్బతింటోంది. ఇదొక్కటే కాదు తిరుమల ఆదాయంపై  కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు.   సీఎం జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం  ని దోచేస్తున్నారని ఆరోపించారు.                                                 


‘టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాల‌నేది కోట్లాది మంది భక్తుల   ఆకాంక్ష. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారు. కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి   గురించి బహిరంగ చర్చ జరగాలి. దేవస్థానం నిర్వహణలో కచ్చితమైన జవాబుదారీతనం   ఉండాలి. జనసేన ప్రభుత్వంలో విభిన్న వర్గాల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తాం’ అని జనసేన పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా నాగబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తామని ప్రకటించారు.                            





 
 
ప్రభుత్వాలు మారినప్పుడుల్లా టీటీడీ  నిర్వహణ వ్యవహరాల్లో ఆయా పార్టీలు అజమాయిషీ చేస్తున్నారని నాగబాబు ఆరోపించారు. టీటీడీ సొమ్ము దోచేస్తున్నారని, కోట్లాది రూపాయల ఆదాయంపై లెక్కా పత్రం లేదని వివరించారు. తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం అని నాగబాబు తెలిపారు. 


ప్రభుత్వాలు దోచుకోకుండా ఉండాలంటే టీటీడీని స్వయం పాలక క్షేత్రంగా మార్చాలని నాగబాబు డిమాండ్ చేశారు. టీటీడీని స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. తమ ప్రభుత్వం వచ్చిన అనంతరం టీటీడీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రను కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.