Vasantha Krishna Prasad Covid Positive: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి పెరగడంతో ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేరారు. అందరిని పలకరించినట్లే కరోనా తనను కూడా పలకరించిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు.
దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో డాక్టర్ల సలహ మేరకు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఫలితాలలో తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. తనతో పాటు నా వ్యక్తిగత సహయకుడు అర్జున్ కి కూడ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తనకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పారు.
గత మూడేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. తనకు కూడా కరోనా సోకిందని.. ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసరం ఉంటే నన్ను ఫోన్ లో తనను సంప్రదించవచ్చునని చెప్పారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఏపీలో కొత్తగా 12,926 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి మరో 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. 73 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ అరుదైన చిత్రాలు చూద్దాం...