Mithun Reddy granted regular bail: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తుతో..రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. వారానికి రెండు సార్లు విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. 

Continues below advertisement

లిక్కర్ స్కాంలో జూలై 19న మిథున్ రెడ్డి అరెస్టు          

ఏపీ లిక్కర్ లిక్కర్ స్కాంలో  మిథున్ రెడ్డిని SIT జులై 19, 2025న అరెస్ట్ చేసిం.  A-4గా FIRలో  నమోదు చేశారు.   2019-2024 మధ్య YSRCP  హయంలో న రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌ జరిగిందని సటిట్  కేసు పెట్టింది.  SIT చార్జిషీట్ల ప్రకారం  మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, లంచాల  సేకరణలో ముఖ్య పాత్ర పోషించాడు. స్కామ్‌కు మస్టర్ మైండ్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ( తో కలిసి చేశారని సిట్ తెలిపింది.              

Continues below advertisement

లంచాలు సేకరించి జగన్ కు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు     

మిధున్ రెడ్డి డిస్టిలరీలు ,  లిక్కర్ కంపెనీల నుంచి నెలకు రూ. 50-60 కోట్ల  లంచాలు సేకరించడంలో కీలక పాత్ర పో,ించారు.  ఈ మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి నుంచి పొంది, విజయసాయ్ రెడ్డి (A-5), బాలాజి (A-33)తో కలిసి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి చేరవేసేవారని సిట్ చెబుతోంది.  లిక్కర్ పాలసీ రూపకల్పనలో పాల్గొని, ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై (  వ్యవస్థను మాన్యువల్ మోడ్‌కు మార్చడంలో  కీలక పాత్ర పోషించారు.  ఇది దుర్వినియోగానికి మార్గం సుగమం చేసి,  లంచాలు చెల్లించిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడానికి దారితీసిందని సిట్ తెలిపింది. సేకరించిన కమిషన్లను రియల్ ఎస్టేట్, సినిమాలు, ఇండస్ట్రీలు ,  విదేశాల్లో ప్రాపర్టీల కొనుగోళ్లకు ఇన్వెస్ట్ చేయడం. మొత్తం రూ. 250-300 కోట్లు YSRCP ఎన్నికల ఖర్చులకు క్యాష్‌గా రూట్ చేశారని సిట్ తెలిపింది.  లంచాలు చెల్లించకపోతే ఆర్డర్లు ఇవ్వకుండా చేయడం వంటివి చేశారని గుర్తించిటన్లుగా సిట్ తెలిపింది.           

వరుసగా లిక్కర్ కేసు నిందితులకు బెయిల్స్           

ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో నలుగురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, దిలీప్‌లకు బెయిల్ వచ్చింది. అయితే వారి బెయిల్స్ ను రద్దు చేయాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. వారికి డిపాళ్ట్ బెయిల్ మంజూరు చేశారని అది నిబంధనలుక విరుద్ధమని సిట్ అంటోంది. అదే సమయంలో మిథున్ రెడ్డిని ఇటీవల రెండు రోజుల పాటు  సిట్ కస్టడీకి తీసుకుంది. చార్జిషీటు దాఖలు చేయడం.. ఇక కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది.