Best Automatic Cars Under Rs 10 Lakh 2025: హైదరాబాద్, విజయవాడ సహా, అన్ని తెలుగు నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్ రోజురోజుకి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మాన్యువల్ గేర్‌లతో డ్రైవింగ్ చేయడం బోరింగ్‌గా, టైరింగ్‌గా అనిపిస్తుంది. అందుకే, ఇప్పుడు ఎక్కువ మంది, యువత నుంచి ఫ్యామిలీస్ వరకు ఆటోమేటిక్ కార్లను ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు, ఆటోమేటిక్ అంటే గల్జరీ అని భావించేవారు, కానీ ఇప్పుడు అవి అవసరంగా మారాయి.
AMT/AGS ఎందుకు వద్దు?
ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ కార్లలో ఎక్కువగా AMT (Automated Manual Transmission) లేదా AGS (Auto Gear Shift) టెక్నాలజీ వాడతారు. కానీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ విషయంలో ఇవి అంతగా స్మూత్‌గా ఉండవు. గేర్ షిఫ్ట్‌లు జర్కీగా ఉంటాయి. అందుకే, మీ బడ్జెట్ రూ. 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. AMT/AGS కాకుండా ఇంకో ఆప్షన్ తీసుకోవడం బెస్ట్.
Hyundai i20 - స్టైలిష్ & స్మూత్
హ్యుందాయ్ i20 ఎప్పటి నుంచో యూత్‌లో ఫేవరెట్. ఇప్పుడు దాని IVT (Intelligent Variable Transmission) గేర్ బాక్స్ వల్ల మరింత స్మూత్ రైడ్ అనుభవం ఇస్తోంది. i20 మ్యాగ్నా IVT, i20 స్పోర్ట్జ్ IVT వేరియంట్లు రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) లభిస్తున్నాయి. రేట్లు అందుబాటులో ఉండడం వల్ల స్టైల్, టెక్ రెండూ కావాలనుకునే వారికి i20 ఒక సాలిడ్ ఆప్షన్.
Honda Amaze - ప్రీమియం ఫీల్
మారుతి డిజైర్‌కు నేరుగా కాంపిటిషన్ ఇస్తున్న హోండా అమేజ్ కూడా CVT (Continuously Variable Transmission) గేర్ బాక్స్‌తో వస్తోంది. ఈ గేర్ బాక్స్ స్మూత్‌గా, బాగా ట్యూన్ చేసి ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో, గేర్ మారిన ఫీలింగ్ కూడా కనిపించనంత సైలెంట్‌గా, స్మూత్‌గా పని చేస్తుంది. దీని CVT వేరియంట్ల ధర రూ. 8.55 లక్షల నుంచి మొదలవుతోంది. ఈ రేంజ్‌లో ఇంత క్వాలిటీ ఆటోమేటిక్ రావడం అరుదైన విషయం.
Tata Tiago EV - గ్రీన్ డ్రైవింగ్ ఫన్
ఎకో ఫ్రెండ్లీగా, భవిష్యత్తు మొబిలిటీ వైపు అడుగులు వేయాలనుకునే వారికి టాటా టియాగో EV బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కార్. టియాగో EVలో XE MR, XT MR వేరియంట్లు రూ. 10 లక్షల లోపు లభిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కాబట్టి ఇక్కడ గేర్ బాక్స్ డ్రామా ఉండదు. డ్రైవింగ్ అనుభవం, వెన్నలా స్మూత్‌గా ఉంటుంది.
బడ్జెట్‌లో స్మార్ట్ ఛాయిస్
మొత్తానికి, రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఉన్నవారు AMT/AGS మోడల్స్‌ను స్కిప్ చేసి, ఈ మూడు కార్లలో ఏదైనా ఎంచుకుంటే రోజువారీ ఉపయోగంలో స్మూత్ డ్రైవింగ్ అనుభవం పొందొచ్చు. హ్యుందాయ్ i20 స్టైల్ కోసం, హోండా అమేజ్ క్లాసీ ఫీల్ కోసం, టాటా టియాగో EV ఫ్యూచర్-రెడీ గ్రీన్ డ్రైవింగ్ కోసం పర్ఫెక్ట్. ఈ ఫెస్టివ్ సీజన్‌లో కొత్త కారు కొనే ప్లాన్ ఉంటే - AMT/AGSకి గుడ్‌బై చెప్పి, ఈ మోడల్స్‌కి హాయ్ చెప్పడం స్మార్ట్ డెసిషన్ అవుతుంది.