క్రమశిక్షణకు మారుపేరు లెజెండరీ నటుడు మోహన్ బాబు (Mohan Babu) అని సినీ ప్రముఖులు చెబుతుంటారు. నటుడిగా మాత్రమే కాదు... విద్యావేత్తగా ఆయన చేసిన మంచి పనులు ప్రేక్షకులు, ప్రజలకు తెలుసు. మోహన్ బాబుతో తెలుగు చిత్రసీమలో మంచు ఫ్యామిలీ ప్రస్థానం మొదలైంది. ఆయన పిల్లలు ముగ్గురూ సినిమాల్లోకి అడుగు పెట్టారు. తండ్రి పేరు నిలబెట్టేలా సినిమాలు చేశారు. అయితే కొన్నాళ్లుగా సరైన విజయాలు రాలేదు. మరోవైపు కుటుంబ కలహాలు, వివాదాలు మంచు ఫ్యామిలీని వార్తల్లో నిలబెట్టాయి. ఇప్పుడు ఆ వివాదాలు పక్కన పెడితే మంచు ఫ్యామిలీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేసింది.

Continues below advertisement

'కన్నప్ప'తో విష్ణు మంచుకు విజయం!మంచు ఫ్యామిలీకి ఈ ఏడాది కలిసి వచ్చిందని చెప్పాలి. ముందుగా.. 2025లో హిట్ ట్రాక్ మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు 'కన్నప్ప'తో మొదలైంది. దీనికి ముందు మూడేళ్లు విష్ణు నుంచి సినిమా రాలేదు. 'జిన్నా' భారీ హిట్ అవ్వలేదు. అంతకు ముందు 'మోసగాళ్లకు మోసగాడు' ట్రోల్ అయ్యింది. ఒకవైపు తోటి హీరోలు అంతా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న సినిమా చేస్తే లాభం లేదని విష్ణు రిస్క్ చేశారు.

భారీ మైథలాజికల్ హిస్టరీ సినిమా 'కన్నప్ప' తెరకెక్కించారు విష్ణు మంచు. కలెక్షన్స్ అనౌన్స్ చేయలేదు గానీ డబ్బులు వచ్చాయి. ట్రోలింగ్ కాకుండా అప్రిసియేషన్ వచ్చింది. విష్ణు సర్‌ప్రైజ్ చేశారని ఆడియన్స్ అన్నారు. హీరోగానూ ఆయనకు పేరు వచ్చింది. పాన్ ఇండియా లెవల్ గుర్తింపు లభించింది. విష్ణు మంచు నెక్స్ట్ సినిమాకు నార్త్ ఇండియాలోనూ మార్కెట్ క్రియేట్ అయ్యింది.

Continues below advertisement

'మిరాయ్'తో తమ్ముడికీ హిట్ వచ్చింది!'కన్నప్ప'కు ముందు తమ్ముడు మనోజ్ మంచు నటించిన 'భైరవం' థియేటర్లలోకి వచ్చింది. అది భారీ విజయం సాధించలేదు. కానీ, అందులో మనోజ్ నటనకు పేరు వచ్చింది. 'భైరవం' వల్ల తనకు రెండు మూడు సినిమాలకు అడ్వాన్సులు వచ్చాయని మనోజ్ తెలిపారు. అయితే అతను ఆశించిన భారీ హిట్ 'మిరాయ్'తో వచ్చింది.

'భైరవం' రీజనల్ సినిమా అయితే 'మిరాయ్' పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. అందులో విలన్ పాత్రలో మనోజ్ మంచు లుక్, నటనకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. 'మిరాయ్' విజయం మనోజ్ మంచు కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు అతని చేతిలో ఉన్నాయ్. విలన్ రోల్స్ చేయడానికి ఓకే అంటున్నారు. ఇక నుంచి వరుసగా మనోజ్ నుంచి మూవీస్ వస్తాయి. 

లుక్కుతో హిట్ వైబ్ ఇచ్చిన మోహన్ బాబు!అమ్మాయి లక్ష్మీ మంచు కోసం 'దక్ష'లో ప్రత్యేక పాత్ర చేశారు మోహన్ బాబు. ఆ సినిమా ఆడలేదు. అయితే ఒక్క లుక్కుతో లెజెండరీ విలనిజం అంటే ఏమిటో మోహన్ బాబు చూపించారు.

Also Readమళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!

న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' సినిమాలో షికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయనది విలన్ క్యారెక్టర్. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఒక చేతి కింద కత్తి... వెనుక గన్నులు... కళ్ళజోడు... లుక్కుతో మూవీకి హిట్ వైబ్ ఇచ్చారు మోహన్ బాబు. 'ది ప్యారడైజ్' పాన్ ఇండియా సినిమా. 'కన్నప్ప'లో కీలక పాత్ర చేయడం ద్వారా మోహన్ బాబు నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెలిశారు. అయితే విలనిజంలో ఆయన స్పెషాలిటీ ఏమిటనేది 'ప్యారడైజ్'తో వాళ్లకు తెలుస్తుంది. లక్ష్మీ మంచు కూడా హిట్ సినిమా చేస్తే హ్యాపీ. 

కొన్ని రోజుల క్రితం మంచు కుటుంబంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. మీడియాలో చూశారంతా! ప్రతి కుటుంబంలో కొన్ని కలహాలు రావడం సహజం. తెలుగు ఇండస్ట్రీలో పేరున్న ఫ్యామిలీ కావడం, క్రమశిక్షణతో మెలిగే కుటుంబం కావడంతో గొడవలు చర్చకు దారి తీశాయి. ఇప్పుడు ఆ కలహాల గురించి కాకుండా మంచు ఫ్యామిలీ సినిమాల గురించి ప్రేక్షకులు మాట్లాడుతుండటం అభిమానులకు సైతం సంతోషాన్ని ఇచ్చే విషయం.

Also Read'హృదయపూర్వం' రివ్యూ: జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో మోహన్ లాల్ - The Raja Saab హీరోయిన్ మాళవికా మోహనన్ సినిమా