NTR Attended To Kantara Pre Release Event With Pain: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే డెడికేషన్‌కు మారు పేరు అని అందరికీ తెలిసిందే. ఎంతటి కష్టంలోనైనా తనను నమ్మిన ప్రొడ్యూసర్స్, ఫ్రెండ్స్ కోసం ఆయన ఏమైనా చేస్తారు అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన నొప్పితోనే హాజరయ్యారు. పెయిన్‌తో అప్పుడప్పుడు ఈవెంట్‌లో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నట్లు కనిపించారు.

'ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా...'

'మామూలుగా ప్రతీసారి అరిచినట్లు మాట్లాడలేను. కొంచెం నొప్పిగా ఉంది. మీరు సైలెంట్‌గా ఉంటే మాట్లాడతా. ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి.' అంటూ ఈవెంట్‌లో స్పీచ్ స్టార్ట్ చేసే ముందు అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇవి. స్టేజీ మీద మాట్లాడుతున్నంత సేపు కుడి భుజం కింద ఆయన తన చేతిని సపోర్ట్ తీసుకునే కనిపించారు. ఈవెంట్‌కు ఎంటర్ అయిన టైంలోనూ ఆయన అలాగే వచ్చారు. చివరకు  తాను ఎక్కువ సేపు నిల్చోలేకపోతున్నానని... లేకుంటే కాసేపు మాట్లాడేవాడినని అన్నారు.

ఫోటోలు, వీడియోలు వైరల్

ఎన్టీఆర్ ఇబ్బంది పడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతూనే... మరోవైపు ఆయన డెడికేషన్‌పై ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గాయం ఇబ్బంది పెడుతున్నా తన ఫ్రెండ్, బ్రదర్ లాంటి రిషబ్ కోసం ఈవెంట్‌కు వచ్చారని అంటున్నారు.

ఇక రీసెంట్‌గా జరిగిన యాడ్ షూట్‌లో ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ సూచించినా ఆయన ఆ మర్నాడే అదే యాడ్ షూట్‌లో పాల్గొని కంప్లీట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో యాడ్ షూట్ కోసం ఏర్పాట్లు చేయగా... తాను రికవరీ అయ్యే వరకూ ఆ సెట్ అలానే ఉంచితే రెంట్ పెరుగుతుంది. దీంతో నిర్మాతకు నష్టం రాకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో నెక్స్ట్ డేనే షూటింగ్‌కు వెళ్లి నొప్పిని భరిస్తూనే కంప్లీట్ చేశారు. గాయం తగిలినప్పటి నుంచీ బయట ఈవెంట్స్‌కు ఎన్టీఆర్ హాజరు కాలేదు. కానీ రిషబ్ 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం నొప్పితోనే హాజరయ్యారు. దీన్ని చూసి దటీజ్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: నేను విన్న అమ్మమ్మ కథల 'కాంతార' - సిల్వర్ స్క్రీన్‌పై రియల్ చేశారు రిషబ్ శెట్టి... 'కాంతార చాప్టర్ 1'పై NTR ప్రశంసల జల్లు

'డ్రాగన్' మూవీ షూటింగ్...

ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతుండగా... ఎన్టీఆర్ గాయం కారణంగా కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా... ప్రొడ్యూసర్ రవి 'కాంతార చాప్టర్ 1' ఈవెంట్‌లో మాట్లాడుతూ... త్వరలోనే షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతుందనే ఊహాగానాలకు తెరపడిందనే చెప్పాలి. అయితే, ఎన్టీఆర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేయాలంటూ ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.