Samantha Ruth Prabhu About Real Love: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. రీసెంట్‌గా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ఆమె... 'శుభం' మూవీతో నిర్మాతగా మారారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత... తాజాగా లవ్, లైఫ్ గురించి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

వీడియోతో పాటు సుదీర్ఘ పోస్ట్

తన ఇన్ స్టాలో ఓ వీడియోతో పాటు సుదీర్ఘ పోస్ట్ పెట్టారు సమంత. ఇందులో తన 20s, 30s లైఫ్‌తో పాటు రియల్ లవ్ గురించి కూడా ప్రస్తావించారు. ఆడపిల్లలు ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలనేది కూడా వివరించారు. శనివారం మేకప్ ఆర్టిస్ట్ అవ్ని రంభియా నేను చాలా మాట్లాడుకున్నాం. అది నన్ను ఆలోచింపచేసింది. 30 ఏళ్ల తర్వాత ప్రపంచం మీకు అంతా డౌన్ అనే చెప్తుంది. మీ ప్రకాశం మసకబారుతుంది. మీ అందం తగ్గిపోతుంది. పరిపూర్ణ ముఖం, పరిపూర్ణ శరీరం, పరిపూర్ణ జీవితం టైం అయిపోతున్నట్లుగా మీరు మీ 20ల్లోకి దూసుకెళ్లాలి.' అని చెప్పారు.

రియల్ లవ్... ఎవరూ చెప్పలేదు

20s లో తన జీవితం చాలా గందరగోళంగా నడిచిందని చెప్పారు సమంత. 'నా 20s లైఫ్ గందరగోళంగా, ఆత్రుతతో గడిచింది. చాలు అనిపించేలా కనిపించేందుకు, చాలు అనిపించేలా అనుభవించేందుకు, చాలు అనిపించేలా ఉండేందుకు తొందరపడ్డాను. దీని ద్వారా లోపల నేను ఎంత కోల్పోయానో, ఎంత మథనపడ్డానో ఎవరికీ తెలియదు. నేను అప్పటికే సంపూర్ణంగా ఉన్నట్లు ఎవరూ నాకు చెప్పలేదు. ఆ నటనను కట్టిపడేయడానికి పరుగులు పెట్టాను.

ప్రేమ... నిజమైన ప్రేమ గురించి నాకు ఎవరూ చెప్పలేదు. ప్రేమ అనేది బయట నుంచి రాదు. అది మన లోపల నుంచే వస్తుంది. మనకు మనం ఎక్కడ దొరుకుతామో అక్కడే నిజమైన ప్రేమను కనుగొంటాం. నిజమైన ప్రేమ నన్ను నేను ఉన్నట్లుగానే కనుగొంటుంది. నేను ఎప్పుడూ ఉండకూడని వ్యక్తిగా నన్ను మలుచుకోకుండా చేస్తుంది.' అని రాసుకొచ్చారు.

Also Read: 'OG' గురించి మరింత తెలుసుకోవాలా? - కామిక్ బుక్ వచ్చేసింది... ఆ క్వశ్చన్స్‌కు ఆన్సర్ తెలియాలంటే...

నా 30ల్లో అలా ఉన్నా...

తన 30ల్లో ఒకటే ప్రపంచాన్ని చూసినట్లు... రెండు జీవితాలు గడపడం ఆపేసినట్లు చెప్పారు సమంత. 'నా 30ల్లో ఏదో మృదువైంది. ఏదో తెరుచుకుంది. పాత తప్పుల భారాన్ని మోయడం ఆపేశాను. ఇతరుల్లో కలిసిపోవాలని ప్రయత్నించడం ఆపేశాను. ఒకటి ప్రపంచానికి చూపేది. రెండు నేను నిశ్శబ్దంగా జీవించేది. రెండు జీవితాలు గడపడం ఆపేశాను. సడన్‌గా పబ్లిక్‌లో ఎలా అయితే కనిపిస్తానో ఎవరూ చూడనప్పుడు కూడా అలానే ఉంటున్నా. ఇప్పటివరకూ నేను అనుభవించిన అత్యంత సజీవమైన విషయం ఇదే.' అని రాశారు.

ప్రతీ అమ్మాయికి ఇదే కోరుకుంటున్నా

ప్రతీ అమ్మాయికి తాను ఇదే కోరుకుంటున్నట్లు చెప్పారు సమంత. 'ప్రతీ అమ్మాయికి ఇలానే కావాలని కోరుకుంటున్నా. ఆమె సంపూర్ణతను కోరుకుంటున్నా. ఆమె పరుగు ఆపేసి చివరికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కలిగే శాంతిని నేను ఆమెకు కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు మీలా ఉన్నప్పుడే... క్షమాపణ లేకుండా, మారువేషం లేకుండా మిమ్మల్ని మీరు విడిపించుకోరు. మొత్తం ప్రపంచాన్ని  విముక్తి చేస్తారు.' అంటూ రాసుకొచ్చారు. ఇది వైరల్ అవుతోంది.