Minister Venu: బీసీల ఓట్లను వాడుకొని గతంలో పదవి దక్కించుకుని ఆ తర్వాత వారిని మర్చిపోయిన వదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు చరిత్రలో బలహీన వర్గాల ద్రోహిగా నిలిచిపోతారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపించారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారత దిశగా సీఎం జగన్ బాటలు వేశారని వేణు అన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడారు. బీసీలను చంద్రబాబు బ్యాక్ వర్డ్ క్లాస్ భావిస్తే బ్యాక్ బోన్ క్లాస్ గా సీఎం జగన్ మార్చారని తెలిపారు.
చంద్రబాబు జీవితం మొత్తం నాటకాలు ఆడడమే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా లోకేష్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడ్డం పెద్ద వింతగా ఉందన్నారు. ఆరోగ్య శ్రీలో రోగాల సంఖ్య చంద్రబాబు తగ్గించడం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాగే చంద్రబాబు పేదలకు విద్యను దూరం చేయడం జరిగిందన్నారు. ఫీ రీ ఎంబర్స్మెంట్ తెచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిదే అని 2007 వరకు పేదలు ఇంజినీరింగ్ చదువుకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ చంద్రబాబు మరో నాటకానికి తెరలేపారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు నచ్చాయంటూ చంద్రబాబు కొత్త నాటకం ఆడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో మోడీ గురించి చంద్రాబు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయని అన్నారు. ఏదీ మర్చిపోలేదంటూ చెప్పుకొచ్చారు. మోడీకి కుటుంబం లేదని.. తనకు ఉందంటూ చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే అంటూ ఫైర్ అయ్యారు.
చంద్రబాబుకు, జగన్‌కు చీకటికి వెలుతురుకు ఉన్న తేడా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని.. 99.9% హామీలు నెరవేర్చామని మంత్రి వేణు పేర్కొన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన సంక్షేపథకాలను ప్రజలకు అందజేస్తున్నామని వివరించారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలను అవినీతి లేకుండా ఎంతో పారదర్శకంగా అందిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటూ గొప్పగా చెప్పారు. ఈ వ్యవస్థ వల్ల ఎస్సీ, ఎస్టీలు, బీసీలు ఎంతో లబ్ధి పొందుతున్నరని మంత్రి వివరించారు.