MGNREGA Job Card 2026:  గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తు్న్నాయి. దీనిని ఉపాధి హామీ పథకం లేదా నరేగా(NREGA) పథకం అని పిలుస్తారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 నుంచి 125 రోజుల పాటు పని కల్పిస్తారు. ఈ వేతనాలు నేరుగా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. AP MGNREGA శ్రామికులు తమ  ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.  . ఉపాధి హామీ జాబ్ కార్డు అప్లై విధానాన్ని తెలుసుకుందాం. 

 ఉపాధి హామీ పథకం అర్హతలు  1. దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి.  2. గ్రామీణ ప్రాంతంలో నివసించాలి.  3. శారీరక శ్రమతో కూడిన పని చేయాలి. 4. ఉపాధి హామీ జాబ్ కార్డ్ ఉండాలి5. ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్ ఉండాలి

ఉపాధి హామీ జాబ్ కార్డు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు  

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్టు సైజు ఫొటోలు, మొబైల్ నెంబర్  

Also Read: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో 

NREGA జాబ్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి 

Step 1: మీ మొబైల్ ఫోన్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా డెస్క్‌టాప్ ద్వారా UMANG వెబ్ సైట్ కు వెళ్లండి.Step 2: మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, OTPతో లాగిన్ అవ్వండి.Step 3: ‘MGNREGA’ అని సెర్చ్ చేసి NREGA జాబ్ కార్డు ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.  Step 4: అవసరమైన వివరాలను నింపి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.  

ఆఫ్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

 గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయానికి వెళ్లండి.  MGREGA అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, సబ్మిట్ చేయండి.వివరాలను ధృవీకరణ తర్వాత, కుటుంబానికి NREGA జాబ్ కార్డు జారీ చేస్తారు.  

Also Read: రెండు లక్షలకు 47వేల రూపాయల వడ్డీ! పోస్టాఫీస్‌లోని ఈ పథకం గురించి తెలుసా?

MGNREGA జాబ్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలి? 

Step 1: MGNREGA వెబ్‌సైట్‌ కు వెళ్లి Generate Reports పై క్లిక్ చేయండి.Step 2: లిస్ట్ లో మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.Step 3: మీ జిల్లా, మండలం, పంచాయతీ, ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుని, ఆపై 'కొనసాగించు' ఆప్షన్ పై క్లిక్ చేయండి.Step 4: 'R1 జాబ్ కార్డు లేదా రిజిస్ట్రేషన్' కింద 'జాబ్ కార్డు/ఉద్యోగ రిజిస్టర్'పై క్లిక్ చేయండి.Step 5: మీ పేరును గుర్తించి, MGNREGA జాబ్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read: ఆధార్ కార్డుతో వీధి వ్యాపారులకు రూ.90,000 రుణం – పూర్తి వివరాలు, అర్హత, అప్లై ఎలా?