Honda Activa e vs QC1: హోండా ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి భారీ ఎంట్రీ ఇచ్చింది. యాక్టివా ఈ (102 కిలోమీటర్ల రేంజ్)QXI(90 వేల నుంచి)తో బడ్జెట్‌  నుంచి ప్రీమియం వరకు ఆప్షన్లు ఇచ్చింది. ధరలు, రేంజ్ ఫీచర్లు, రియల్ వరల్డ్‌ పని తీరు పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి

Continues below advertisement

దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచిన హోండా ఇప్పుడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ముద్ర వేస్తోంది. పెట్రోల్‌ ధరల పెరుగుదల, పెరుగుతున్న కాలుష్యంతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా హోండా తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను రూపొందించింది. 2026 నాటికి భారత్ మార్కెట్‌లో హోండా ప్రధానంగా రెండు మోడళ్లను విక్రయిస్తోంది. 

Continues below advertisement

హోండా యాక్టివా ఇ

హోండా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా బ్రాండ్ పేరుతో వచ్చిన ఈ స్కూటర్, ప్రస్తుతం మార్కెట్‌లో హాట్‌ కేకులా అమ్ముడవుతోంది. యాక్టివా ఈ ప్రారంభ ధర సుమారు 1,23,528గా ఉంది. ఇందులో ప్రధానంగా రెండు వేరియంట్లు ఉన్నాయి. యాక్టివా ఇ ఎస్టీడీ బేసిక్ మోడల్. యాక్టివా ఇ రోడ్‌సింక్స్‌ డ్యూయో ఆధునిక ఫీచర్లతో కూడిన టాప్ ఎండ్ మోడల్. దీని ధర 1,58,746 వరకు ఉంటుంది. 

ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్లు దూసుకెళ్లిపోవచ్చు. ఇందులో 6kW శక్తిమంతమైన మోటార్ అమర్చారు. ఇది నగర ప్రయాణాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వినియోగదారులకు సౌలభ్యాన్ని అందించేందుకు హోండా ఇందులో H-Smart కీ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఇది మొబైల్‌ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 

హోండా క్యూసీ1 

బడ్జెట్ వినియోగదారుల కోసం తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ కావాలనుకునే వారికి హోండా క్యూసీ1 ఒక ప్రత్యామ్నాయం. దీని ప్రారంభ ధర  97,460 నుంచి మొదలవుతుంది.  ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ఇస్తుంది. ఇందులో 1.8kW మోటార్ ఉండగా, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 6.5 గంటల సమయం పడుతుంది. 

ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి అతి పెద్ద ఆందోళన బ్యాటరీ ఖర్చు. దీనిని పరిష్కరించేందుకు హోండా తన బ్యాటరీ  స్వాపింగ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో నెలకు 1999గా ఉన్న బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను ఇప్పుడు కేవలం 678 రూపాయలకే తగ్గించింది. దీని వల్ల పెట్రోల్ వాహనాలతో పోలిస్తే నెలవారీ నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుంది. 

భారత్ మార్కెట్‌లో హోండా ఎలక్ట్రిక్ బైక్‌లు ప్రధానంగా టీవీఎస్ఐ క్యూబ్‌, బజాజ్ చేతక్‌ వంటి మోడళ్లతో పోటీ పడుతున్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ధర దాదాపు 1.15 లక్షలు ఉండగా, బజాజ్ చేతక్ ధర 1.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హోండా తన బ్రాండ్ విలువ,సర్వీస్ నెట్‌వర్క్‌తో ఈ పోటీని ఎదుర్కొంటోంది. 

హోండా కేవలం ఈ రెండు మోడళ్లతోనే ఆగడం లేదు. యాక్టివా ఇ, క్యూసీ1ల ద్వరా వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా లోకలైజ్డ్‌ విడిభాగాలతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందిస్తోంది. 

మోడల్‌ధర   రేంజ్‌   మోటార్  కీ ఫీచర్స్‌  ఎవరికి బెస్ట్ 
హోండా యాక్టివా e1.19లక్షలు-1.52లక్షలు 102 కిలోమీటర్లు    6kW   బ్యాటరీ స్వాప్ చేసుకోవచ్చుఫ్యామిలీ, డైలీ ఎక్కువ దూరం తిరిగేవారికి 
హోండా QC190వేల నుంచి...  80 కిలోమీటర్లు1.8kW ఫిక్స్‌డ్‌ బ్యాటరీబడ్జెట్ యూజర్లకు