Chiranjeevi On Ukraine Doctor : ఉక్రెయిన్(Ukraine) ను విడిచిరానంటున్న తెలుగు వైద్యుడు గిరికుమార్(Girikumar) కోసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్వీట్ చేశారు. తాను పెంచుకుంటున్న చిరుత, జాగ్వర్(Jaguar) విడిచిరాలేక అక్కడే ఉంటున్న గిరికుమార్ ఇటీవల ఓ వీడియోలో తెలిపారు. తనను స్ఫూర్తిగా తీసుకుని కుమార్ జాగ్వర్, పాంథర్ లను పెంచుకుంటున్నాడని తెలిపి ఎంతో సంతోషం కలిగిందని చిరంజీవి ట్వీట్(Tweet) లో ఉన్నారు. గిరికుమార్ పెంపుడు జంతువులను వదిలిరాలేకపోతున్నాడని తెలిసి తన హృదయాన్ని ద్రవింపచేసిందని చిరు అన్నారు.
స్పందించిన చిరు
చిరంజీవి తన ట్వీట్ లో..."డియర్ డాక్టర్ గిరికుమార్ పాటిల్, నన్ను స్ఫూర్తిగా తీసుకుని జాగ్వర్, పాంథర్‌లను పెంచుకుంటున్నావని తెలిసి నాకెంతో ఆనందంగా అనిపించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న భయానక పరిస్థితుల్లో పెంపుడు జంతువులను(Pet Animals) వదల్లేక, వాటి సంరక్షణ దృష్టిలో ఉంచుకుని అక్కడే ఉండిపోయావని తెలిసి నా హృదయం ద్రవిస్తుంది. మూగజీవాల పట్ల నువ్వు పెంచుకున్న ప్రేమ, ఆదరణ ఎంతో ప్రశంసనీయం. ఈ సమయంలో నువ్వు సురక్షితంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. యుద్ధం త్వరగా ముగిసిపోయి, సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
లంకేశ్వరుడు సినిమా స్ఫూర్తితో
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) తణుకుకు చెందిన గిరికుమార్ కొన్ని సంవత్సరాల క్రియం మెడిసిన్ చదువుకునేందుకు ఉక్రెయిన్ కు వెళ్లారు. ఆ కోర్సు పూర్తైన తర్వాత అక్కడే ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే గిరికుమార్ చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. చిరంజీవి లంకేశ్వరుడు సినిమా చూసి స్ఫూర్తి పొందిన గిరికుమార్ ఉక్రెయిన్ ప్రభుత్వ అనుమతితో బ్లాక్ పాంథర్, జాగ్వార్‌లను పెంచుకుంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం(Russia War) ప్రకటించడంతో అక్కడ ఉన్న పరిస్థితుల్లో తన పెంపుడు జంతువులను వదిలి రాలేకనుంటూ గిరి కుమార్ ఓ బంకర్ లో తలదాచుకుంటున్నారు. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్ లో పరిస్థితులపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెడతానంటున్నారు.
యుద్ధం తర్వాత పరిస్థితులపై వీడియోలు
భీకర యుద్ధం జరుగుతున్నా, తాను పెంచుకుంటున్న పులి కోసం ఉక్రెయిన్ లోనే ఉంటానని కుమార్ అంటున్నారు. గత 19 నెలలుగా కుమార్ ఈ పులిని పెంచుకుంటున్నాడు. యుద్దం జరుగుతున్న ప్రాంతంలో తానొక్కడినే ఉన్నానని కుమార్ అంటున్నారు. కుమార్ తన యూట్యూబ్ లో వీడియోలు పెట్టాడు. ఈ వీడియోలు నెటిజన్లు, స్నేహితులు ఉక్రెయిన్ వదిలి వచ్చేయాలని కుమార్ కు సూచిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ లోని పరిస్థితులను యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తానని కుమార్ అంటున్నాడు.
Also Read: Ukraine Jaguar Kumar: పెంపుడు పులితో బంకర్ లో, ఉక్రెయిన్ ను విడిచి రానంటున్న తెలుగు యువకుడు!