Lokesh Chit Chat : రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ చేసే ఇష్టారీతి అప్పులతో ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, సాలుచింతలలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.
ప్రభుత్వం చేతిలో మీడియా వారూ బాధితులే !
ఈ ప్రభుత్వం చేతిలో మీడియా వారూ బాధితులేvvf ఇళ్ల స్థలాల కోసం గతంలో కమిటీ వేశామన్నారు.
జర్నలిజం కష్టమైన వృత్తి. తమిళనాడులో మీడియా వారికి పెన్షన్ అంశం నా దృష్టిలో ఉంది. సోషల్ మీడియా కూడా పవర్ ఫుల్ గా మారింది. రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందులో మీడియా భాగస్వామ్యం కావాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు వేధింపులు లేకుండా చేసే బాధ్యత తనదన్నారు. న్యాయవాదులు కూడా రక్షణ చట్టం అడుగుతున్నారు. జగన్ లా నేను భయపడను. అన్నింటికీ సమాధానం చెప్తానన్నారు.
ఉద్యోగాలు సంక్షేమం కాదు.. అదొక ఎకనమిక్ యాక్టివిటీ
టీడీపీ హయాంలో 40 వేల పరిశ్రమలతో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో గౌతం రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తాం. గతంలో ఉద్యోగాలకు రాష్ట్రంలో చంద్రబాబు విత్తనం వేశారు. కియా తెచ్చాం తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అగ్రరాజ్యాల్లోనూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలి. చంద్రబాబే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. రెవెన్యూ రాబడిలోనూ రాష్ట్రం వెనకబడింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు లేదు. వ్యవసాయం వెనకబడిందన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా టీడీపీ నిలబెట్టుకుంది. 20 లక్షల ఉద్యోగాలు సంక్షేమం కాదు..అదొక ఎకానమీ యాక్టివిటీ. కేజీ టు పీజీ కరికులమ్ మార్చేస్తాం. ధరలు పెరగడం వల్ల పెట్టుబడి పెరుగుతోంది. చేపలు, రొయ్యలు సాగులో ఇన్ పుట్ సబ్సీడీ తగ్గింది..పెట్టుబడి పెరిగిందన్నారు. గతంలో ఆక్వా రైతులకు విద్యుత్ తక్కువ ధరకే అందించాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆక్వా ఏపీకి అవసరం. పక్కరాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్నారు...మనమూ వరినే సాగుచేస్తే కుదరదు. గతంలో ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
నెల్లూరు, కడపల్లోనూ టీడీపీకి మంచి ఆదరణ
నెల్లూరు, కడప జిల్లాల్లో 10కి 10 సీట్లు వైసీపీకి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి మంచి ఆదరణ ఉంది. నిన్న 8 కి.మీ 7 గంటలకు పైగా పట్టింది. మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రం ఎటుపోతుందోనన్న ప్రజల్లో ఆందోళన ఉంది. నెల్లూరు, కడప జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తాం. గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పున:ప్రారంభిస్తామన్నారు. జర్నలిస్టులకు సంక్షేమ నిధి, రిటైర్ మెంట్ తర్వాత బెనిఫిట్స్, ప్రత్యేక చట్టం గురించి పార్టీ పెద్దలతో మాట్లాడి నేను నిర్ణయం ప్రకటిస్తామని హామ ఇచ్చారు. కొన్ని ఛానల్స్ వైసీసీ ప్రోత్సాహంతో లేనిది ఉన్నట్లు చూపిస్తూ..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. తప్పులు చూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్దంగా ఉన్నానన్నారు.
సమాజాన్ని చీల్చిన నేత జగన్
ఐదుగురు వేరు వేరు కులస్తులు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా.? ఇదంతా ఐ ప్యాక్ తెచ్చిందే. రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ కులాల ప్రస్తావన తెస్తున్నారు..అదే తెలంగాణలో మాట్లాడితే తంతారు. పూతలపట్టులో జర్నలిస్టులకు అవకాశం ఇచ్చామన్నారు. జగన్ లా ఊరికో హామీ నేను ఇవ్వను..రక్షణ చట్టంపై స్టడీ చేస్తాం. టీడీపీ కార్యకర్తలపై, కార్యాలయాలు, బీసీ, దళితులపై దాడులు చేస్తే మాపై కాదు కదా..అని అందరూ అనుకున్నారు. నన్నూ వ్యక్తిగతంగా దూషించారు. జాఫర్, విజయ్ పాత్రుడు ఫ్యామిలీని బయటకు లాగారు. అది రేపు మీ ఇంటికి కూడా వస్తుందని హెచ్చరించారు. 2012 నుండి నన్ను, బ్రాహ్మణిని ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్తే భయపడతారనేది వైసీపీ విధానం. మీడియాపై దాడి జరిగితే టీడీపీ అండగా ఉంటుంది. బకాయిలు పెట్టడం వల్ల ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదు. మేమొచ్చాక స్ట్రీమ్ లైన్ చేసి, సక్రమంగా అమలు చేస్తామన్నారు.
స్మార్ట్ మీటర్ల కొనుగోలులోనూ అవినీతి
మిగులు విద్యుత్ లో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. వైసీపీ వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పీపీఏలు జగన్ వచ్చాక రద్దు చేశారు. డిమాండ్ పెరిగేకొద్దీ..అధిక ధరకు కొంటున్నారు. ఆ భారం ప్రజలపై పడుతోందన్నారు. స్మార్ట్ మీటర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఛార్జీలు తక్కువ ఉండాలి..గతంలో మేము తక్కువకే అందించాం..కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి పేదల బాధలు తెలియవు. ప్రజలతో పాటు జర్నలిస్టులకు కూడా మూడేళ్లలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. విభజన అనంతరం పాలించడానికి రూములు కూడా లేవు. రైతులను ఒప్పించి 32 వేల ఎకరాలు రాజధానికి సేకరించాం..అందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.