కల్తీ సారాపై శాసన మండలి , అసెంబ్లీలో ( AP Assembly ) చర్చ పెట్టాలని ... ఏపీలో ఏ మద్యం దుకాణం నుంచి అయినా సరే శాంపిల్స్ తీసుకుని దేశంలో ప్రఖ్యాత ల్యాబ్స్‌కి టెస్టులకు పంపిద్దామని సీఎం జగన్మోహన్ రెడ్డికి ( CM Jagan ) నారా లోకేష్ ( Nara Lokesh ) సవాల్ చేశారు. కల్తీ సారా, కల్తీ మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఉ్ననతాధికారులకు వినతి పత్రం ఇద్దామని వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను ( TDP MLAs ) పోలీసులు అరెస్ట్ చేసి ఉంగుటూరు స్టేషన్‌కు తరలించారు ఎమ్మెల్యేను టీడీపీ నేత నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ సభ్యులను సస్పెండ్ ( MLAs Suspend ) చేసి అసెంబ్లీలో మద్యం పాలసీపై ప్రకటన చేశారని.. ఇందులో కూడా ఆయన లిక్కర్‌లో రసాయనాలు ఉన్నాయని అంగీకరించారన్నారు. తాము కేవలం 30 నిమిషాలు మాత్రమే చర్చ ( Assembly Discussion ) పెట్టాలని కోరామన్నారు. కల్తీ సారా మరణాలు కాదు.. సహజ మరణాలని సీఎం జగన్ అనడం దారుణమని లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి.. ఇప్పుడు కొత్త కొత్త బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చి ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారని మండిపడ్డారు.
కల్తీ సారా వల్లే 26 మంది చనిపోయారని మృతుల కుటుంబసభ్యులే చెబుతుంటే... అసెంబ్లీ సాక్షిగా అవి సహజ మరణాలని సీఎం జగన్ అనటం దారుణమన్నారు. బాబాయ్ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు.. ఇప్పుడు సారా మరణాలను సహజ మరణాలంటున్నారని నారా లోకేశ్ ( Nara Lokesh ) ఎద్దేవా చేశారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం నేర్పిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో కల్తీ సారా , మద్యం ( Liqor )పై తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అసెంబ్లీ, మండలిలో చర్చకు పట్టుబడుతోంది. అయితే అధికారపక్షం అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ నేతలు బయటే పోరాడుతున్నారు.