Lulu Mall Lands Issue:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లూలూ గ్రూప్‌కు విశాఖపట్నం, విజయవాడలో ప్రధాన భూములు లీజ్‌పై అలాట్ చేయడం వెనుక భారీ సబ్సిడీలు, రివర్షన్ క్లాజ్‌లు లేకుండా  లీజ్‌లు ఇవ్వడం వంటి నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవలే అహ్మదాబాద్‌లో 519 కోట్ల రూపాయలకు 16 ఎకరాలు కొన్న లూలూ ఇంటర్నేషనల్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను 'సబ్సిడీ' రూపంలో తక్కువ రేట్‌లో తీసుకుంటూ, విలువైన ఆస్తులను కార్పొరేట్ లాభాలకు మార్చుకుంటోంది. 

Continues below advertisement

అహ్మదాబాద్ డీల్ - మార్కెట్ రేట్‌కుకొనుగోలు

అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలో లూలూ గ్రూప్ 16.35 ఎకరాల ప్రధాన భూమిని 519.41 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.  ఈ డీల్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)తో జరిగింది, ఇక్కడ లూలూ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ రేట్‌లో పూర్తి చెల్లింపు చేసి, రికార్డు స్థాయి 31.16 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ భూమిపై మెగా మాల్ నిర్మాణం ప్రణాళికలో ఉంది, ఇది గుజరాత్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఊపునిస్తోంది.  ఈ డీల్ ఏపీలో జరుగుతున్న అలాట్‌మెంట్‌లతో పోల్చితే పూర్తి భిన్నంగా ఉంది.  అహ్మదాబాద్‌లో ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా, పూర్తి మార్కెట్ విలువతో కొనుగోలు చేసిన లూలూ, ఏపీలో మాత్రం ప్రభుత్వ భూములను తక్కువ రేట్‌లో లీజ్‌పై తీసుకుని, "సబ్సిడీ"లా మార్చుకుంటోంది.  

Continues below advertisement

 ఏపీలో ల్యాండ్ అలాట్‌మెంట్: విశాఖ, విజయవాడలో సబ్సిడీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జులైలో జారీ చేసిన GO 137 ,,,,  GO 45 ప్రకారం, విశాఖపట్నంలో 13.74 ఎకరాలు, విజయవాడలో 4.15 ఎకరాలు APSRTC భూములను లూలూ గ్రూప్‌కు లీజ్‌పై అలాట్ చేసింది.  విశాఖలో భూములు హార్బర్ పార్క్ సమీపంలో, RK బీచ్ వద్ద ఉన్న ప్రధాన ప్రదేశాల్లో ఉన్నాయి. విలువ సుమారు 2,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆంధ్రా టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2024-29 ప్రకారం, 65 సంవత్సరాల లీజ్ (మరో 33 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు) ఇచ్చారు, కానీ రివర్షన్ క్లాజ్ (ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే భూమి తిరిగి ప్రభుత్వానికి) లేకపోవడం, తక్కువ రేట్  లో ఇవ్వడం వంటి అంశాలు వివాదానికి కారణమయ్యాయి. విజయవాడలో మాల్ ప్రాజెక్టుకు 1,222 కోట్ల పెట్టుబడి ప్రకటించినప్పటికీ, భూమి అలాట్‌మెంట్‌లో పారదర్శకత లేకపోవడం వల్ల ప్రజలు, రైతు సంఘాలు నిరసనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు 10,000 ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం చెప్పినా ఆ ఉద్యోగాలు ఎవరికిస్తారన్నదానిపైనా విమర్శలు ఉన్నాయి. 

ప్రజల్లో చర్చనీయాంశం  

వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ల్యాండ్ అలాట్‌మెంట్ ను వ్యతిరేకిస్తున్నాయి.  విజయవాడ భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. APSRTC ఎంప్లాయీస్ యూనియన్లు GO 137ను వ్యతిరేకిస్తూ, RTC భూములు మాల్‌లకు మార్చడం వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ బలహీనపడుతుందని హెచ్చరించాయి. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు విజగ్‌లో 14 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌ను ఉచితంగా ఇవ్వడాన్ని "ప్రభుత్వ అనైతికత"గా అభివర్ణించాయి.   "లూలూ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తాయి" అని ప్రభుత్వం వాదిస్తోంది. 

ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు ?  

అహ్మదాబాద్‌లో మార్కెట్ రేట్‌లో పెట్టుబడి చేసిన లూలూ, ఏపీలో సబ్సిడీలతో భూములు తీసుకోవడం వల్ల "డబుల్ స్టాండర్డ్" ఆరోపణలు ఎదుర్కొంటోంది. YSRCP, CPI(M)లు రద్దు డిమాండ్ చేస్తుంటే, TDP ప్రభుత్వం "ఉద్యోగాలు, పెట్టుబడి"ని హైలైట్ చేస్తోంది. పరిశ్రమలకు అంటే సరే..కానీ మాల్స్ కు కూడా భూమిని ఎందుకు సబ్సిడీకి ఇవ్వాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు బడా కంపెనీలు విశాఖకు వస్తున్నందున.. ఆ భూమిని వేలం వేస్తే..  కంపెనీలు కొనుగోలు చేసి  పెద్ద మాల్స్ నిర్మిస్తాయని అంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటికి సమాధానం చెప్పకపోతే.. లూలుతో కుమ్మక్కయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉంది.