Anantapur News: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులకు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు బాధతో కన్నీళ్లు, జరిగిన అన్యాయంపై ఆవేశం, నష్టాన్ని పూడ్చాలని ఆవేదన ఇలా మొత్తం ప్రెస్‌మీట్ అంతా ఎమోషనల్‌గా సాగింది.
గత ప్రభుత్వంలో చాలా మంది అధికారు తనను తన ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..."నన్ను వేధించారు. కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఈ వాహనాలు కేసుకు సంబంధించి నన్ను, నా కొడుకులను, భార్యనీ, నా కొడలను అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఇన్ని రూట్ బస్సులు ఉన్న వారు ఏపీలో ఎవరు లేరు. మమ్మల్ని దొంగలుగా చూపించారు."
"ఇప్పుడు వెళ్ళి బాబును అడిగితే అన్ని చేస్తారు. కానీ నేను అడగను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. నా బస్సులను సీజ్ చేసిన ప్రతి అధికారి ఇంటి దగ్గరకు వెళ్ళి కూర్చుంటా. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని బస్ సీజ్ చేస్తారా?. మీ ఇంటి దగ్గర కూర్చొని నష్ట పరిహారం కట్టించుకుంటా. "
ఈ రాష్ట్రాన్ని గబ్బు లేపింది కొంతమంది ఐఎఎస్, ఐపీఎస్‌లని ఆరోపించారు. వ్యవస్థలను కూల్చింది వారనన్నారు. తనకు జరిగిన అన్యాయానికి నష్ట పరిహారం చెల్లించుకుంటే ఒక్కొక్కర్నీ వెంటాడతానన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావిస్తే పార్టీకి రాజీనామా చేసి పోరాడాతానన్నారు జేసీ. తనను జరిగిన అన్యాయంపై కన్నీళ్లు పెట్టుకున్నారు చేసి... బస్సుల కోనుగోలు విషయంలో దొంగలని జైలుకు పంపారన్నారు. కావాలనే బస్సులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆవేదన చెందారు.
"బీఎస్-3 వాహనాలు అమ్మినవారు, రిజిస్ట్రేషన్ చేసినవారు ఇంటికి పోయారు. న్యాయం జరగకపోతే కుమారుడు, కోడలు ఎస్పీ కార్యాలయం ముందు నిరహారదీక్ష చేస్తారు. నేను, నా భార్య డీటీసీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తాం. పేర్ని నానీ... థూ.. నీ బతుకు. నిన్ను వచ్చి కొట్టినా ఎవర్రా దిక్కు. మీ నాన్న ఎంతో మంచోడు. పదిరోజుల్లో నాకు న్యాయం జరగపోతే మీ సంగతి చూస్తా. నేను గడ్డం పెంచింది నా కొడుకు ఎమ్మెల్యేగా గెలవాలనో, చంద్రబాబు సీఎంగా అవ్వాలని కాదు. నా నియోజకవర్గ ప్రజలకు ఎన్నో కష్టాలు పెట్టారు. నరుకుతం అందర్నీ. ఏ మాత్రం వదిలి పెట్టేది లేదు. ఈ విషయం చంద్రబాబు, ప్రభుత్వానికి సంబంధించినది కాదు నా వ్యక్తిగత విషయం. "