TS Inter Reverification 2024: ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 18న వెలువడిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. డిజిలాకర్‌లోనూ ఫలితాలను పొందుపరిచారు. మే 24 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా 861 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు.  కాగా ఇంటర్ ప్రథమ సంవత్సం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు. 


ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 74,868 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో మొత్తం 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో పాసైన విద్యార్థులు జూన్ 30లోపు సంబంధిత కళాశాలల్లో పొందవచ్చు. ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే రీవెరిఫికేషన్‌ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 20 నుంచి 24 వరకు తమ ఆన్సర్ స్క్రిప్ట్‌ల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.   


AP Inter Second Year Supplementary Exams Results (Direct Link)..


ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఒకే రోజు రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,37,587 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మిడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేపట్టారు. జూన్ 18న ఇంటర్ ద్వితీయ సంవత్సరాలు ఫలితాలను వెల్లడించగా.. జూన్ 26న ప్రథమ సంవత్సరం ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించనుంది.


ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించగా... ఫలితాలను ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12న విడుదల చేసింది. ఇంటర్ జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ రెండో సంవత్సరంలో 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా చూస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించి ఇటీవలే వాటి ఫలితాలను బోర్డు విడుదల చేసింది. తాజా మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..