Pulivendula Farmer Viral Video | పులివెందుల: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సబ్సిడీతో పరికరాలు అందిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు రావడంతో ఓ యువ రైతు ఆనందం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రభుత్వానికి పులివెందుల రైతు ధన్యవాదాలు

రైతు కొనుగోలు చేసిన డ్రిప్ పరికరాలకు మొత్తం రూ.2.69 లక్షలు ఖర్చు కాగా, తాను కేవలం రూ.27 వేలు మాత్రమే చెల్లించానంటూ బిల్లు చూపించారు. తనకు రెండు లక్షల నలభై వేల రూపాయల ప్రయోజనం చేకూరిందన్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనకు 90 శాతం డ్రిప్ సబ్సిడీ వచ్చిందని పులివెందుల యువ రైతు విష్ణు వర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం

90 శాతం సబ్సిడీతో రైతులకు డ్రిప్ పరికరాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కి పులివెందుల రైతు ధన్యవాదాలు తెలియజేశారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం డ్రిప్ పరికరాలు అందించని కారణంగా రాష్ట్రంలో హార్టికల్చర్ దిగుబడి చాలా తగ్గిందని కూటమి నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలకు ఇదే విధంగా న్యాయం జరుగుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. పులివెందుల యువ రైతుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read: PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ