Road Accident In Anantapur District | కూడేరు: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కారు ఆటో ఢీకొన్న ప్రమాదంలో గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన సరస్వతి, లోకేశ్వరి, లీలావతి అనే ముగ్గురు అక్కచెల్లెళ్లతో పాటు సరస్వతి కూతురు మూడు నెలల చిన్నారి విద్యాశ్రీ ఈ ప్రమాదంలో మృతి చెందారు. మరో ఆరు మందికి  మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రాజు, పోలీసు సిబ్బంది గాయపడిన వారిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు అనంతపురం పి వి కే కే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు పెన్నహోబిలం నుంచి అనంతపురం వెళుతుండగా రాష్ డ్రైవింగ్ తో ఆటోని ఢీకొట్టారని ప్రాథమికంగా భావిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తేలనున్నాయి.