New Districts In Andhra Pradesh: విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, సెలబ్రిటిలు ఆందోళనలు చేసినా, ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు చెప్పినా నూతన జిల్లా కేంద్రం విషయంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు అధికార పార్టీ నేతలు. ఒక్క నూతన జిల్లా కేంద్రం విషయమే కాదు, ధర్మవరం రెవిన్యూ డివిజన్ విషయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గేందుకు మొగ్గు చూపడం లేదు. జిల్లా కేంద్రంలో కచ్చితంగా రెవిన్యూ డివిజన్ ఉండాల్సిందే కాబట్టి కచ్చితంగా ధర్మవరం నుంచి రెవిన్యూ డివిజన్ ను పుట్టపర్తికి మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి (New District Puttaparthi) కాకుండా హిందూపురం చేయాలంటూ ఇటీవల బాలయ్య ఆందోళణ చేసిన సంగతి తెలసిందే. అయితే ఆ ఆందోళనులను కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొన్నట్టు కనిపించడం లేదు. నూతన జిల్లా కేంద్రం ఆ జిల్లా వాసులకు సెంటర్ గా వుంటుంది. అంతే కాకుండా ఎయిర్ పోర్టు, పెనుకొండలోని మెడికల్ కాలేజీ, కియా ప్యాక్టరీలు దగ్గరగా వున్ననేపథ్యంలో పుట్టపర్తి వైపే అదికార పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ అదిష్టానం ఈ మేరకు జిల్లా నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎవ్వరూ నోరు మెదపద్దు అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ కేవలం ఈ అంశంపై రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి తప్పితే ఇంతకంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు అని అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ అంశంలో ఇక ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు వైసీపీ సిద్దం అవుతోంది. అందుకే ఇప్పటికే స్పష్టంగా కొత్త జిల్లా కార్యకలాపాలు విషయంలో కూడా ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కార్యాలయాల ఏర్పాటు విషయంలో సత్యసాయి ట్రస్టు బిల్డింగ్ లు వాడుకొనేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక అధికారులు కూడా స్పీడ్ పెంచారు.


ఇప్పటికే జిల్లాఎస్పీ పుట్టపర్తిలో పర్యటించి అక్కడ బిల్డింగ్ లు ఏర్పాటు విషయం కూడా పరిశీలించారు. కలెక్టరేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా అదికారులు స్పీడ్ పెంచారు. నూతన జిల్లా కేంద్రం విషయంలో ప్రతిపక్షాల ఆందోళనలను పట్టించుకోవలసిన అవసరం లేదని, కేవలం ప్రజాసంఘాల అభ్యంతరాలు పరిశీలించదగినవి అయితేనే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నూతన జిల్లా కేంద్రం పనులు స్పీడ్ పెంచేందుకు అదికారులు సిద్దం అవుతున్నారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంపై ప్రతిపక్ష టీడీపీ ఆందోళణలకు సిద్దం అవుతోంది. ప్రభుత్వం మొండి వైఖరిపై కూడా సీరియస్‌గా రియాక్ట్ అవ్వాలని టీడీపీ నేతలు చెబుతున్నారు.


Also Read: Anantapur Love Story: ఈ మట్టిని తాకితే ప్రేమ సక్సెస్, భగ్న ప్రేమికుల యథార్థగాథ మీకు తెలుసా ?


Also Read: Sarva Darshan Tickets: ఆఫ్లైన్‌లో తిరుమలేశుడు సర్వదర్శనం టోకెన్లు, ఎన్ని జారీ చేస్తుందంటే?