Gummanuru Jayaram News: ఎట్టకేలకు మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపి విడుతున్నట్టు ప్రకటించారు. వైసిపి పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు మంత్రి గుమ్మనూరు జయరాం టిడిపిలోకి వస్తున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు మంత్రి గుమ్మనూరు జయరాం ముగింపు పలుకుతూ తాను టిడిపిలో చేరనున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది అసలు రాజకీయం ఇప్పుడే మొదలు కాబోతుందా.. అసలు గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని సొంత నియోజకవర్గ ఆలూరు నుంచి పోటీ చేస్తారా లేక అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా.
మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న జయరాం గత కొంతకాలంగా వైస్సార్సీపీకి దూరం అవుతున్నారని జిల్లాలో గట్టిగా వినిపించింది. ఎట్టకేలకు ఆ ప్రచారం నిజమైంది.. వైసీపీ నీ వీడి సైకిల్ ఎక్కుతున్నారు తనే స్వయంగా ప్రకటించాడు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ టికెట్ లేదని అధిష్టానం చెప్పడంతో సైలెంట్‌గా ఉన్న గుమ్మానూర్ జయరాం కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజులు అనంత జిల్లాల్లో రాయదుర్గం టికెట్ కావాలని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.. ఫైనల్ గా గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇంతకీ గుంతకల్ నియోజకవర్గాన్ని ఎంచుకివటానికి ప్రధానంగా గుంతకల్ ప్రాంతం తన సొంత ఊరు గుమ్మనూరు సరిహద్దులో ఉండడం.. అదీకాక బళ్లారికి అత్యంత సమీపంగా ఉండడం.. అదేవిధంగా గుంతకల్లులో ఆయన బంధు వర్గం, సామాజిక వర్గం బలంగా ఉంది.
కుమారుడు టీడీపీలోకి వస్తారని ఊహాగానాలు
దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టిడిపి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ గుంతకల్లు టిడిపి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తన కుమారుడు కాకుండ ఏకంగా తనే బరిలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చాడు గుమ్మనూరు. అది కాకుండా గుంతకల్ లో టీడిపి లో ఇప్పటివరకు జితేంద్ర గౌడ్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగుతున్నాడు. 2014 ఎన్నికల్లో గుంతకల్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో కూడా ఆయన కుటుంబ సభ్యులే గుంతకల్లు నియోజకవర్గం. ప్రస్తుతం జితేంద్ర గౌడ్ వయోభారంతో ఉన్నప్పటికీ సరైన వారసత్వం లేక జితేంద్ర గౌడ్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు గుంతకల్లు నియోజకవర్గం పై ఆయుర్వేదం బిసి నేతలు చూపు కూడా ఉంది.
పార్టీని నడిపించే అంత కెపాసిటీ లేదని బహిరంగ రహస్యం. టీడిపి కూడా గట్టి నాయకుడి కోసం చాన్నల్లు గా వేతుకులాట చేస్తూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు ఒక నాయకుడు దొరికాడ అన్న ప్రచారం సాగుతోంది. అందులోనూ గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే. ప్రధానంగా 25% ఓటు బ్యాంకు బోయ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుండి పోటీ చేస్తే తనకు కలిసి వస్తుంది అన్న కోణంలో పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా అటు గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ గుంతకల్లు వచ్చి కొంతమంది సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.. అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గానికి ప్రక్కనే ఆలూరు నియోజకవర్గం ఉండడం.. ఆలూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు, ప్రజలు గుంతకల్లుతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం కూడా గుమ్మనూరు జయరాంను గుంతకల్లు వైపు చూసేలా చేస్తుంది.
గుంతకల్లు నుంచి!
గుంతకల్లు నుండి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయం కావడంతో.. ఇప్పటివరకు ఉన్న తెలుగుదేశం నాయకులు గానీ, కేడర్ గాని అతనికి ఎంతవరకు సహకరిస్తారు అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే గుంతకల్ లో డజను మంది టీడిపి నాయకులు ఉన్నారు ... ఆయన రాకను ఎంతవరకు సహరిస్తారు అనేది క్వశ్చన్ మార్క్.. అలాగే నిన్నటి వరకు టిడిపి నాయకులు గుమ్మనూరు జయరాంను బెంజి మంత్రి.. బెంజి మంత్రి అంటూ విమర్శించారు. ఇవాళ అదే బెంజ్ మంత్రిని టిడిపిలోకి ఆహ్వానించి టికెట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా అదికార పక్షం కూడ కూడా టీడీపీని విమర్శలతో ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది.... మరి ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్నే ప్రతికూలతలు కూడ ఉండడంతో మంత్రి గుమ్మనూరు జయరాం ఎలా జయిస్తాడో అనేది వేచి చూడాలి.