Kurnool SP Siddharth Kaushal
 - మంత్రాలయంలో భక్తులకు ఇబ్బందులు కలిగించకూడదు
- సమస్య ఉంటే 7777877722 కు వాట్సాప్ చేయండి
- కర్నూలు జిల్లా ఎస్పీ, ఐపీఎస్ సిద్దార్థ్ కౌశల్


 కర్నూలు జిల్లా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే లాడ్జీ రూములకు అద్దె రేట్లు అధికంగా పెంచి భక్తులను ఇబ్బంది పెడితే సంబంధింత యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 


క్రిస్మస్ సెలవులు , న్యూ ఇయర్  సెలవులు రానునుండడంతో వారాంతాపు సెలవులు ఉండడంతో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి శ్రీ మంత్రాలయం రాఘవేంధ్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. శబరిమలకు వెళ్ళిన అయ్యప్ప భక్తులు కూడా పెద్ద మొత్తంలో యాత్రికులు రావడంతో మంత్రాలయంలో లాడ్జీ యజమానులు, మేనేజర్లు సిండికేట్ గా ఏర్పడి, ప్రభుత్వం నిర్దారించిన రేట్ల కంటే రూమ్ లకు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ప్రైవేట్ లాడ్జీలలో రూములు ఖాళీగా ఉన్నప్పటికీ.. అందుబాటులో లేవని తాత్కలికంగా డిమాండ్ క్రియేట్ చేసి  యాత్రికులు, భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏవరైనా హద్దు మీరి అధిక మొత్తంలో లాడ్జీల రుసుము వసూలు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. 


భక్తులు, యాత్రికుల నుండి అధిక మొత్తంలో లాడ్జీలలో, సత్రాలలో డబ్బులు వసూలు చేస్తే  ప్రజలు పోలీసు వాట్సప్ నెంబర్ 7777877722 కు  సమాచారం అందించాలన్నారు. ఏవరైనా అక్రమంగా లాభపడాలని చూస్తే రెవిన్యూ, విజిలెన్స్, పోలీసు అధికారులు కలిసి టీమ్ లుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యాజమాన్యం భక్తులు రద్దీగా ఉన్న సమయంలో శ్రీ రాఘవేంద్రస్వామికి చెందిన కళ్యాణ మండపాలు, డార్మెటరీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఎస్పీ కోరారు. అంతేకాకుండా హోటల్ యజమానులు భక్తుల రద్దీ ఉన్నప్పుడు హోటళ్ళలోని తినుబండరాలను, ఇతర వస్తువులను  అధిక ధరలకు అమ్మితే కూడా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఇక మన చట్టాల విషయానికి వస్తే.. పెళ్లికాని జంటలు హోటళ్లలో ఒకే గదిలో బస చేయవచ్చు. అయితే, వారి వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. తగిన గుర్తింపు కార్డులు కూడా ఉండాలి. పెళ్లి కాని జంటలు హోటళ్లలో ఉండకూడదని చెప్పేందుకు ఎలాంటి చట్టం లేదు. కానీ, మన దేశంలో కొన్ని హోటళ్లు, గెస్టు హౌస్‌లు వారికి రూమ్ ఇవ్వడానికి సందేహిస్తాయి. అయితే, అది హోటళ్లు నిర్వాహకులు విధించుకున్న సొంత నియమం. కాబట్టి.. వారి నియమాలను గౌరవించాలి. 


2019లో కొయంబతూర్ జిల్లా అధికారులు ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు సీల్ వేశారు. అందులో పెళ్లికాని జంటలు నివాసం ఉంటున్నాయని అందుకే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు దీనిపై తీర్పు ఇస్తూ.. ‘‘హోటల్ రూమ్స్‌లో పెళ్లికాని జంటలు లేదా స్త్రీ, పురుషులు కలిసి ఉండకూడదనే నిబంధన ఏదీ లేదు. అలాగే పెళ్లికాకుండా ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేయడం కూడా నేరం కాదు’’ అని స్పష్టత ఇచ్చింది.