Kethireddy vs JC Prabhakar Reddy | నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో ఒకసారి తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై చేసిన వ్యాఖ్యల అనంతరం మరుసటిరోజే కేతిరెడ్డి తాడిపత్రిలోకి రావడంతో ఏం జరుగుతుందో అని హైటెన్షన్ నెలకొంది. ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన అలాగే వారితో పాటు మరి కొంతమంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 


తాడిపత్రి అల్లర్ల ఘటన కేసుల్లో జామీన్లు వేయడానికి గత 15 రోజుల నుంచి పోలీసు అధికారులను అడుగుతున్నప్పటికీ.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పందించకపోవడంతో శనివారం ఉదయం నేరుగా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. ఈ కేసుల్లో తనతో పాటు మరో పదిమందిపై కూడా ఇవే కేసులో ఉన్నాయని వారందరూ జామిన్ లు, షూరిటీలు ఇవ్వకుండానే తాడపత్రి నియోజకవర్గంలో యధేచ్చగా తిరుగుతున్నారని పెద్దారెడ్డి చెప్పారు. అలా తిరుగుతున్న వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారని గుర్తు చేశారు. 


నీ అరుపులకు బెదిరిపోయే వాడ్ని కాదు
నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి భయపెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరని జెసి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దవా చేశారు. నేను తాడిపత్రి పట్టణంలోకి వస్తే పంచ ఊడదీసి కొడతానని మీడియా ముందు జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కేతిరెడ్డి పెద్దరెడ్డి స్పందించారు. తాడపత్రి నియోజకవర్గ ఏమైనా జెసి కుటుంబం జాగిర అని మండిపడ్డారు. తాడపత్రి నియోజకవర్గంలో 87 వేల ఓట్లు తెచ్చుకున్న నేతను నేను మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి దాన్ని పరిష్కరించుకునేందుకు ఖచ్చితంగా నేను తాడపత్రి లో ఉండి ప్రజానీకానికి అందుబాటులో ఉంటానని తెలిపాడు. నన్ను నా కొడుకులను ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి నువ్వు ఎవరని ప్రశ్నించాడు. నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పటికీ నేను చూసి చూడనట్లు వెళ్లిపోతున్నానని గతంలో కూడా మా అన్నను చంపిన కూడా ఫ్యాక్షన్ వద్దని సైలెంట్ గా ఉన్నానని తెలియజేశాడు. నువ్వు నన్ను ఏమైనా చేయాలి అనుకున్న ఒకవేళ చేసినా కూడా నా కొడుకులిద్దరూ నా అన్న కొడుకులే ఇద్దరు కూడా చూస్తూ ఊరుకునే వారు కాదని హెచ్చరించారు. 


నీ వాహనాలపై నేను కేసు పెట్టలేదు- కేతిరెడ్డి పెద్దారెడ్డి 
నీకు సంబంధించిన బిఎస్ 3, బిఎస్ 4 వాహనాలపై నేను కేసులు పెట్టలేదని జెసి ప్రభాకర్ రెడ్డి వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ లపై అధికారులే అతనిపై కేసులు నమోదు చేశారని పెద్దారెడ్డి గుర్తు చేశారు. జెసి ప్రభాకర్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టే ప్రభుత్వ అధికారులు కేసులు పెట్టారన్నారు. ఇవన్నీ తెలియక తనను, తన కుమారులను ట్రాన్స్‌పోర్ట్ అధికారులను నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. తన మీదగానీ, తన వాహనాల మీద దాడి చేసినా ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. 


తాడిపత్రిలో ముదురుతున్న నేతల మాటల యుద్ధం : 
నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకి పెరుగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. నిన్నటి జెసి ప్రభాకర్ రెడ్డి తన మీద పెట్టిన కేసుల విషయంలో బుధవారం అనంతపురం నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ల వల్లనే రాష్ట్రం సర్వ నాశనమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అతని కుమారులను జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వారు తాడపత్రి పట్టణంలోకి వస్తే బట్టలు ఊడతీసి కొడతానంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. 
Also Read: టీడీపీ అరాచకాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి - ఎంపీలకు జగన్ దిశానిర్దేశం


ఈ మాటలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. తాడిపత్రి నియోజకవర్గ ఏమైనా జెసి కుటుంబం జాగీరా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాడిపత్రి నియోజకవర్గంలో 87 వేల ఓట్లు తనకు వచ్చాయన్నారు. అక్కడ ఉన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. జేసీ కుటుంబం తనను ఏమైనా చేయాలనుకుంటే, తాను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు.