YSRCP : తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని జగన్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వాటిని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు.  ఇప్పటివరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారని..  వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని జగన్ చెప్పారు.  హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉందన్నారు.  తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో, తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడులు చేశారని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


వైసీపీని అణగదొక్కలేరు ! 


టీడీపీ మనుషులను అక్కడ కావాలని ఉంచేలా పోలీసులతో ప్లాన్‌చేసి దాడులు చేశారని  జగన్ ఆరోపించారు.  మాజీ ఎంపీ రెడ్డప్ప, న్యాయవాది అయిన రెడ్డప్ప ఇంటికి వెళ్తే దాడులు చేశారని..  తప్పులు వారు చేసి తిరిగి మన పార్టీ వాళ్లమీద కేసులు పెడుతున్నారుని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలన్నారు.  15 సంవత్సరాలగా వైయస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీ ప్రస్థానంలో ఉంది ..చంద్రబాబు ఆశించినట్టుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కలేరని తేల్చి చెప్పారు. 


రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేద్దాం ! 


జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయి.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయాలన్నారు.  చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని సూచించారు.  పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని..  అసెంబ్లీ సమావేశాల్లో తానూ నిరసన తెలుపుతానన్నారు.  మంగళవారం నాటికి ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు వస్తారని..బుధవారం నాడు నిరసన తెలుపుదామన్నారు.  రాష్ట్రంలో జరిగిన దారుణాలన్నింటినీ కూడా దేశ ప్రజలకు చూపుదామని భరోసా ఇచ్చారు. 


 





 


ఢిల్లీలో నిరసన బాధ్యతలు ఎంపీలకు !                                       


ఈ విషయంలో మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుపోవాలని.. జగన్ పార్టీ ఎంపీలకు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రుల పాయింట్‌మెంట్లను కోరాననన్నారు.అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీమీద దాడులు చేయడం అనేది ధర్మమా అని జగన్ ప్రశఅనించారు.  రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు .. ప్రజాస్వామ్యం మనుగడకు పెద్ద దెబ్బగా భావించాలన్నారు.  ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశిచారు. ఎంపీలంతా ఢిల్లీకి వెళ్లి వెంటనే ఈకార్యక్రమంలో నిమగ్నం కావాలని ఆదేశిచాంచారు. రాష్ట్రంలో వైయస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు.. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని ఎంపీలకు జగన్ తేల్చి చెప్పారు.