Road Accident in Anantapur District | గార్లదిన్నె మండలం తలగాసి పల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతా కూడా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన తాతయ్య, పెద్దక్క గా గుర్తించారు. తిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలి పని నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో తలగాసిపల్లి క్రాస్ దగ్గర హైదరాబాద్ కు వెళ్తున్న బస్సు, ఆటోని ఢీ కొనడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న వివరాలను సిఐ లను అడిగి డిఎస్పి తెలుసుకున్నారు. కడప ఆర్టిసి రీజినల్ చైర్మన్ పూల నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పూల నాగరాజు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పని కోసం ఆటోలో గార్లదిన్నెకు వచ్చారు. మొత్తం 12 మంది కూలీలు పని కోసం వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఆటోలో కూలీలు తిరిగి వెళ్తుండగా ఆర్టీసీ రూపంలో మృత్యువు వీరిని కబళించింది. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాల గద్దయ్య, రాంజమనమ్మ అక్కడిక్కడే మృతి చెందగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తుంటే నాగమ్మ, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ, డీఎస్పీలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమని భావిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.