Kurnool Ganesh Nimajjan: కర్నూలు జిల్లాలో నేడు గణేష్ నిమజ్జనం  ప్రశాంతంగా  జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్టు కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. పోలీసులు పకడ్బందీగా విధులు నిర్వహించాలని.. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా కూడా చిన్న పాటి సంఘటన చేసుకోకూడదని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిమజ్జన ప్రాంతాల్లో అపశ్రుతులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా పోలీసు కార్యాలయ పేరడ్ మైదానంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులు,  సిబ్బందితో జిల్లా ఎస్పీ గారు సమావేశమై దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ లో హైదరాబాద్ గణేష్ నిమజ్జనం తర్వాత ఏపీలో కర్నూల్ గణేష్ నిమజ్జనంకు అంత ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. గట్టిగా పని చేయాలన్నారు. 


నిమజ్జనం ప్రాంతంలో చిన్నపిల్లలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శోభా యాత్ర జరిగే రహదారులు, కూడళ్లు, నిమజ్జనం వేళ ఎలాంటి ఘటనలు లేకుండా నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విధుల పట్ల ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. నిమజ్జన ఘాట్ దగ్గర విధులు నిర్వహించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. 24 గంటలు కష్టపడితే గణేష్ నిమజ్జనం ఏలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తవుతుందన్నారు. నిమజ్జనం పూర్తిగా ముగిసే వరకు విధులు కేటాయించిన స్ధానాల్లోనే ఉండాలన్నారు. ఎక్కడైనా, ఏమైనా సమస్యలుంటే సత్వరమే స్పందించాలన్నారు. 


నిమజ్జన కార్యక్రమం అంతా ఏడు సెక్టార్లుగా విభజించాము. ఆ సెక్టార్లకు డిఎస్పి స్థాయి అధికారులను కేటాయించామన్నారు. పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించకుండా బాధ్యతగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. గణేష్  నిమజ్జన కార్యక్రమంలో భక్తులు, ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యహరించాలన్నారు. గణేష్ నిమ్జనానికి డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ, హోంగార్డ్సు, కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల పోలీసు సిబ్బంది ఉన్నారు.