Varla Ramaiah: జగన్ రెడ్డి మోహన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో కేసు ఎటూ తెగకా.. కోర్టులకు డబ్బులు పెట్టుకోలేక  జనుపల్లి శ్రీనివాసరావు కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతుందోంది. పూటగడవని స్థితికి చేరిందని.. దయ చేసి వారి కుటుంబ సభ్యులకు ఏదైనా ఉద్యోగం కల్పించి వారి కుటుంబానికి అండగా నిలవాలని శీను తరపున వాదిస్తున్న అడ్వకేట్ సలీమ్ ..శ్రీను  కుటుంబ సభ్యులతో నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వచ్చారు.  సీఎం అందుబాటులో లేకపోవడంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు వినతి పత్రం ఇచ్చి సమస్యను తెలియ జేశారు.         


పాదయాత్రలో ఆదుకుంటామని హామీ ఇచ్చిన నారా లోకేష్                    


పిఠాపురంలో యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్  ను కలిసి సమస్యను చెప్పుకోగా అధికారంలోకి వచ్చిన తరువాత ఆదుకుంటామని హామీ ఇచ్చారని.. అందుకే ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు చెప్పుకోవడానికి వచ్చామని శ్రీను కుటుంబ సభ్యులు వర్ల రామయ్యకు తెలియజేశారు. వారితో పాటు వచ్చిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వరప్రసాద్   జగన్  మోహన్ రెడ్డి వలన ఒక దళిత బిడ్డ ఐదేళ్లు జైళ్లో మగ్గడమే కాక.. దళిత కుటుంబం ఆర్థిక బాధలతో పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.           


శనివారం చంద్రబాబును కలిసే ఏర్పాటు చేస్తామని వర్ల రమయ్య హామీ                 


జగన్ అరాచక పాలనలో దళితులకే ఎక్కువ అన్యాయం జరిగిందని.. నా ఎస్సీలు, నా దళితులు అంటూనే వారినే హతమార్చి వారిని జైళ్లకు పంపించారని.. వారికి దక్కాల్సిన ఫలాలు అందకుండా చేసి ఆర్థికంగా తీవ్ర దెబ్బతీశాడని.. అందులో భాగంగానే కోడికత్తి శ్రీను కుటుంబానికి కూడా అన్యాయం జరిగిందని  వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  దళితులపై ప్రేమ ఉంటే ఆయన కోసం చేసిన చిన్న గాయానికే దళిత బిడ్డను ఐదేళ్లు జైళ్లో మగ్గనిచ్చేవాడా..? అని ప్రశ్నించారు.     


దళితులకు జగన్ అన్యాయం చేశారని విమర్శలు 


 ఆయనకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ కు మాత్రం పెద్ద పదవిని కట్టబెట్టాడు. కోడి కత్తి దాడి వలనే నాడు సానుభూతి ఓట్లతో జగన్ గద్దెనెక్కాడు. వారు ఎలాంటి వారో అర్థం అయ్యాక శ్రీను కుటుంబ సభ్యులు న్యాయం, సాయం కోసం నేడు టీడీపీ కేంద్ర కార్యాలయ తలుపు తట్టారు. చంద్రబాబు పేదల మనిషి అని ఎటువంటి తారతమ్యాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఆదుకునే  మానవతావాది అని.. ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లి సాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా వర్ల రామయ్య శ్రీను కుటుంబ సభ్యలకు హామీ ఇచ్చారు.  అలాగే శనివారం ముఖ్యమంత్రిని కలిసి సమస్యను తెలియజేయాలని సూచించారు. దళిత బిడ్డలకు టీడీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.