Kodali nani :   రాజకీయంగా పవన్ కళ్యాణ్ తమను ఎదుర్కొంటూ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే సమాధానం ఇస్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు, పవన్ కళ్యాణ్ ఎన్ని విడతల యాత్రలు చేసిన తమకు అభ్యంతరం లేదని, చంద్రబాబు మద్దతు దారులతో కలిసి తమను విమర్శిస్తేనే తాము సహించమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు  పని అయిపోవడంతో ఆయన శ్రేయోభిలాషులందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుదారులుగా మారారని విమర్శఇంచారు.  వారి అంతిమ లక్ష్యం చంద్రబాబుని కనీసం ప్రతిపక్ష నేతగనైనా చూడాటమేనని కొడాలి నాని అన్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు స్వయంగా చెప్పేందుకు అనేకసార్లు ప్రయత్నించానని, కుదరకపోవడంతో మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.


చంద్రబాబుపై ఎప్పట్లాగే తిట్ల పురాణం అందుకున్న కొడాలి నాని                                       


గుడివాడలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఎప్పట్లాగే తనదైన భాషలో మాట్లాడారు.  ప్రాజెక్టుల పేరుతో యాత్ర చేస్తున్న చంద్ర‌బాబు  అధికారంలో వున్న‌ప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు.  అధికారం ఇస్తే ఇప్పుడు ప్రాజెక్టులు క‌డ‌తాన‌ని మాయ మాట‌లు చెబుతున్నాడ‌ని విమ‌ర్శించారు.  స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న‌ది టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా  చంద్ర‌బాబు ఉన్నారన్నారు.   1978 నుంచి 40 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు కీల‌కంగా ఉన్నార‌ని, మ‌రెందుకు ఈ కాలంలో సాగునీటి ప్రాజెక్టులు క‌ట్ట‌లేద‌ని కొడాలి నాని ప్ర‌శ్నించారు.                                   


చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శ                               


పులిచింత‌ల‌, గాలేరు-న‌గ‌రి, తెలుగు గంగ‌, వెలుగొండ ప్రాజెక్టుల‌ను ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని చంద్ర‌బాబును ప్రశ్నించారు.  పోల‌వ‌రానికి జాతీయ హోదా తీసుకొచ్చిన ఘ‌న‌త వైఎస్సార్‌ది అని ఆయ‌న గుర్తు చేశారు. పోల‌వ‌రం కాలువ‌లు త‌వ్వుతుంటే  కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు.  అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్క ప‌ని కూడా చేయ‌లేదని  చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ సొల్లు క‌బుర్లేనన్నారు.  లెగిస్తే మ‌నిషిని కాద‌ని చెప్పే చంద్ర‌బాబు చేసేదేమీ లేద‌న్నారు.                


నారా లోకేష్ పైనా విమర్శలు                                                                      
 
నారా లోకేష్  పిచ్చివాగుడు వాగితే చూస్తూ ఊరుకేన‌ది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. అలాగే 2024 ఎన్నిక‌లే చంద్ర‌బాబుకు చివ‌రివి అని కొడాలి నాని అన్నారు.