Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు అమ్మాయి జాహ్నవి దంగేటి ఓ అద్భుతం చేయబోతోంది. 23ఏళ్ల Space Scientist జాహ్నవి 2029లో అంతరిక్షంలో అడుగు పెట్టబోతోంది. U.S కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ Titan Space Industries -TSI 2029లో చేపట్టే స్పేస్ మిషన్‌లో జాహ్నవి Astronaut Candidate ASCAN గా ఎంపికైంది. జాహ్నవి NASA ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఇప్పుడు, ఆమె మరో పెద్ద్ద అడుగు వేస్తోంది టెటాన్ స్పేస్ ద్వారా అంతరిక్షంలో కాలుమోపనుంది,
నేను స్పేస్‌లోకి వెళుతున్నా... -Istagram Post
తాను అంతరిక్షంలోకి వెళ్లబోతున్నట్లు తనే స్వయంగా పోస్ట్ చేసింది. 'I am Going to Space' అంటూ జాహ్నవి చాలా ఉత్సాహంగా పోస్ట్ చేసింది. "చిన్నప్పుడు చందమామ నా వెనుకే వస్తున్నట్లు అనుకునే దానిని.. అది నన్ను ఇక్కడ వరకూ తీసుకొస్తుందని అనుకోలేదు. నా చిన్నప్పటి అద్భుతం ఇప్పుడు నిజమైంది.." అని జాహ్నవి రాసుకొచ్చింది.
జాహ్నవికి చిన్నప్పటి నుంచి స్పేస్ మీద చాలా ఆసక్తి ఉంది. ఆ ఇంట్రస్ట్‌తోటే NASA స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. స్పేస్ లోకి వెళ్లడం తన డ్రీమ్ అని అందుకోసం చిన్నప్పటి నుంచే అనేక ప్రోగ్రామ్స్‌లో శిక్షణ తీసుకున్నాని జాహ్నవి మూడేళ్ల కిందట ABP DESAM కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. రెండేళ్ల వయసులోనే అమ్మమ్మ చెప్పిన కథలతో చందమామ, అంతరిక్షంపై ఆసక్తి పెరిగిందని జాహ్నవి చెప్పింది. "టైటాన్స్ స్పేస్ క్లాస్ 2025 కి ASCAN గా ఎంపికవ్వడం చాలా గౌరవంగా.. గర్వంగా ఫీలవుతున్నాను. Titan Space Mission 2029 లో మొదలవుతుంది. ఈ ఆర్బిటల్ ఫ్లైట్ 5గంటల పాటు స్పేస్ లో ఉంటుంది. అందులో ౩గంటల పాటు.. జీరో గ్రావిటీలో ఉంటాం. భూమి కక్ష్య చుట్టూ రెండు సార్లు తిరిగి రెండు సూర్యోదయాలు.. రెండు సూర్యాస్తమయాలు చూస్తాం.."
దంగేటి జాహ్నవి ఎవరు?
దంగేటి జాహ్నవి పాలకొల్లు. తల్లి దండ్రులు ఇద్దరూ కువైట్‌లో ఉద్యోగాలు చేస్తారు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగిన జాహ్నవి తన చదువును అక్కడే కొనసాగించింది. . ఆ తర్వాత పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి స్పేస్‌మీద ఆసక్తి చూపిన ఆమె.. చిన్నతనంలో స్కూబా డైవింగ్ నేర్చుకుంది. అంతరిక్ష కార్యక్రమాల గురించి తెలుసుకుని ఆన్‌లైన్ ద్వారా కోర్సులు పూర్తి చేసి.. ఆ దిశగానే ప్రయత్నాలు చేసింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమె ప్రయత్నాలను ప్రోత్సహించారు. ఆమె ISRO , నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లతో సహా చాలా చోట్ల తన అనుభవాలను పంచుకున్నారు.
జాహ్నవి International Astronomical Search Collaboration (IASC), వంటి NASA స్పాన్సర్డ్ ప్రోగ్రామ్‌తో పాటు.. అనేక స్పేస్ ఏజన్సీలు ప్రోగ్రామ్స్‌లో పాల్గొంది. STARRS టెలిస్కోప్ ద్వారా ఓ ఆస్టిరాయిడ్ కనుకున్న ప్రోగ్రామ్‌లో తనది యాక్టివ్ రోల్. NASA స్పేస్ యాప్స్ పీపుల్స్ చాయిస్ అవార్డ్, ISRO యంగ్ అచీవర్ అవార్డ్.. సాధించింది.